ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా దొరికే వాటిని తీసుకుంటే శరీరానికి ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా ప్రకృతి ప్రసాదించిన వాటిలో మనకు సహజ సిద్ధంగా లంభించేది వేప.. అందుకే దీనిని ఆయుర్వేద నిధిగా భావిస్తారు. దీని ఆకులు, కాండం, పండ్లు ఇంకా పువ్వులు(Flowers) అన్ని కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.వేపలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. వేప ఆకులను(Neem Leaves) ఖాళీ కడుపుతో తింటే ఖచ్చితంగా అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు. ప్రతి రోజూ కూడా ఉదయాన్నే 5 నుంచి 6 వేప ఆకులను నమిలితే.. ఖచ్చితంగా చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. అలాగే రక్త సమస్యతో బాధపడేవారు వేపతో తమ దినచర్యను స్టార్ట్ చెయ్యండి. ఇలా చేయడం వల్ల రక్తహీనత (Anemia) సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు. రక్తం కొరతను తీర్చడంలో వేప ఆకులు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.



చర్మంలో సహజమైన మెరుపును పెంచడంలో కూడా వేప ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను కడిగి బాగా నమలండి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్య నుంచి మంచి ఉపశమనం పొందడమే కాకుండా మొటిమలు ఇంకా అలాగే మచ్చలు కూడా ఈజీగా తొలగిపోతాయి. నేటి కాలంలో బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో వేప ఆకులను తింటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంకా అలాగే యాంటీ ఫంగల్ తదితర గుణాలు బాగా కనిపిస్తాయి. వీటి వల్ల శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి బారి నుంచి చాలా ఈజీగా రక్షించుకోవచ్చు. వేప ఆకులను బాగా నమలడం వల్ల షుగర్‌ ఉన్న వారికి షుగర్‌ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: