బంగాళాదుంప ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా రుచికరమైన వంటకం.ఇండియాలో చాలా మంది కూడా ఇష్టపడే వంటకం ఈ బంగాళాదుంప వంటకం.బంగాళదుంపను కూరగాయలలో మహా రాజుగా పరిగణిస్తారు. అయితే దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? బంగాళాదుంప ఎక్కువగా తింటే ప్రమాదమే.ఇక వారంలో ఎక్కువ రోజులు బంగాళాదుంప ని తినడం వల్ల అనేక దుష్ర్పభావాలు ఎదుర్కొనే అవకాశం ఉందని.. దీని వల్ల బరువు పెరగడం సహా మధుమేహం బారిన పడే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. మీరు బంగాళదుంపలను ఎక్కువగా తింటుంటే.. దాని వల్ల మీరు అలెర్జీకి గురయ్యే ఛాన్స్ కూడా ఉంటుందట. అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను కూడా బాగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు అసలు ఎక్కువగా బంగాళదుంపలను తినకూడదట. 


బంగాళదుంపల అధిక వినియోగం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడే ఛాన్స్ మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే బ్లడ్‌లోని షుగర్‌ను నియంత్రించేందుకు కూడా బంగాళదుంపలు ఏమాత్రం సహకరించదట. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలుగడ్డ అధిక వినియోగం రక్తపోటును కూడా బాగా పెంచుతుంది. అంటే బీపీ రోగులు బంగాళదుంపలు అసలు ఎక్కువగా తినకూడదు. అలా తినడం వల్ల రక్తపోటు సమస్య కూడా బాగా పెరుగుతుందట. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధిక మొత్తంలో కేలరీలు అనేవి చాలా పెరుగుతాయి. ఇది ఊబకాయానికి కూడా దారి తీస్తుంది. అలాగే బంగాళాదుంప చిప్స్ ని కూడా ఎక్కువగా తినడం వలన వంధ్యత్వానికి దారితీస్తుంది. కొవ్వులు ఇంకా అలాగే కొలెస్ట్రాల్ ఉనికి పునర్పుత్తి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను కూడా చూపిస్తుందట.కాబట్టి బంగాళాదుంపలు ఎక్కువగా తినకండి. లేదంటే ఈ ప్రమాదకర సమస్యల బారిన పడి పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: