ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఏవేవో బాధలు, కష్టాలు తప్పక ఉంటాయి. అంతే కానీ ఈ జీవితం ఎవ్వరికీ కూడా అంత సాఫీగా సాగదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అయితే ఈ విధమైన బాధలు, కష్టాలను తీర్చుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు ఏమో... ఆ బాధలకు దారి తీసిన పరిస్థితులను కనుగొని పరిష్కరించుకుని హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మరి కొందరు వీటిని పరిష్కరించుకోవడం మానేసి కలిగిన బాధలను గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అయితే మానసిక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఇలా ఎక్కువగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా ప్రమాదమని తెలుస్తోంది. మరి అసలు ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

* అతిగా ఆలోచించడం వలన మీ యొక్క శారీరక ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. అంటే మీ మనసులో ఒక ఆలోచన ఉన్నప్పుడు ఇంకా ఏ విధమైన పని మీద కూడా పూర్తి దృష్టిని కేంద్రీకరించలేరు. అందుకే మీ శరీరం రోజు రోజుకి బలహీనంగా మారిపోతుంది.

* అది మాత్రమే కాకుండా మీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

* ఈ ఆలోచనలు ఇంకా పెరిగిపోతే... అతి తక్కువ కాలంలో బీపీ, డిప్రెషన్, యాంగ్జైటీ కలిగి ప్రమాదం ఉంది.

* ఆలోచనలు ఉన్న వారు తిండి మరియు నిద్రకు దూరం అవుతారు. దీని వలన గుండె సంబంధిత వ్యాధులు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది.

*  ఇంకా చెప్పాలంటే జీర్ణసంబంధిత వ్యాధులు మరియు అధిక బరువు కు కారణం అవుతుందని ప్రముఖులకు సూచిస్తున్నారు. కాబట్టి అతిగా ఆలోచించేవారు రోజూ ధ్యానం మరియు వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: