మధుమేహం చాలా ప్రమాదకరమైన వ్యాధి. కాబట్టి ఆ వ్యాధి రాకుండా ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సంకేతాలు మధు మేహానికి కారణం అవుతాయి. ఇక అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1. మెడ చుట్టూ చర్మం నల్లబడటం- మీ మెడ చుట్టూ ఉన్న చర్మం రంగు నల్లబడటం కనుక ప్రారంభించినట్లయితే, మీ రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ చర్మ పరిస్థితిని అకాంటోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. అకాంథోసిస్ నైగ్రికన్స్ కూడా మధుమేహానికి సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు.


2.బొబ్బలు- ఇక ఇలా తక్కువ మందికి మాత్రమే జరుగుతుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు కూడా చర్మంపై అల్సర్ల సమస్యను చాలా సార్లు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వ్యాధిలో, శరీరంలోని ఏ భాగంలోనైనా బొబ్బలు రావడం స్టార్ట్ అవుతుంది. చర్మం కాలిన తర్వాత వచ్చే అల్సర్‌లతో పోలిస్తే ఈ అల్సర్‌లలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. ఈ బొబ్బలు చాలా పెద్దవిగా కూడా ఉంటాయి.


3.స్కిన్ ఇన్ఫెక్షన్- అలాగే మధుమేహ రోగులు కూడా చర్మవ్యాధి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. డయాబెటిస్ వల్ల వచ్చే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఏ భాగంలో అయినా కానీ రావచ్చు.


4. అలాగే చర్మం గట్టిపడటం- ఇక మధుమేహం కారణంగా , మీ శరీరంలోని కొన్ని భాగాల చర్మం చాలా గట్టిగా మారుతుంది. దీని కారణంగా కదలికలో చాలా సమస్య అనేది మీకు ఉంటుంది. మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణలో కనుక లేకుంటే వేళ్ల చర్మం రాయిలా గట్టిపడుతుంది. కొన్ని సందర్భాల్లో, మోకాలు, మోచేతులు ఇంకా అలాగే చీలమండల చుట్టూ చర్మం చాలా గట్టిగా మారుతుంది. దీని కారణంగా కొన్నిసార్లు మీరు మీ చేతులు ఇంకా అలాగే కాళ్ళను వంగడం లేదా నిఠారుగా చేయడంలో చాలా ఇబ్బంది పడతారు.కాబట్టి మధు మెహం రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. సరైన సమయానికి నిద్ర పోండి. సరైన సమయానికి తినండి. రోజు కనీసం ముప్పై నిముషాలు అయిన ఖచ్చితంగా వ్యాయామం చెయ్యండి. ఖచ్చితంగా మధు మేహం బారిన పడరు.

మరింత సమాచారం తెలుసుకోండి: