ప్రస్తుత కాలంలో సంబంధంలేకుండా దాదాపుగా అన్ని కాలాలలో అన్ని పండ్లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా జామ పండు అన్ని కాలాలలో దొరుకుతోంది. ఇక రుచి తో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ధర విషయంలో కూడా కాస్త తక్కువగానే ఉంటుంది జామపండు. అందుచేతనే ఈ జామ పండ్లు ఎక్కువగా తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. జాంపండు లో పుష్కలంగా లభించే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు చాలా మేలు చేస్తాయి. ఇక పరగడుపున జామ పండు తింటే రెట్టింపు లాభాలు కూడా ఉంటాయట అయితే ఇప్పుడు ఆ లాభాలను ఒకసారి తెలుసుకుందాం.

1). జామ పండులో ఉండే విటమిన్-సి వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది తరచు జలుబుతో బాధపడేవారు వీటినీ తినవచ్చు.

2). జామ పండులో పుష్కలంగా ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తక్కువ కేలరీల తో అవసరమైన విటమిన్లు కూడా అందుతాయి కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు వీటిని తినవచ్చు.

3). ఫైబర్ జామపండ్లు పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణక్రియ రేటును పెంపొందించడానికి విరోచనాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

4). జామపండును ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం గుండె చాలా మెరుగుపడుతుంది. బీపీ సమస్య లు కూడా తగ్గిపోతాయి.

5). జామకాయలో వుండే పోషకాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా ఉపయోగపడతాయి.. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని దరిచేరనివ్వదు.

6). షుగర్ పేషెంట్లకు జాంపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది జాములో పుష్కలంగా ఉండే ఫైబర్ వల్ల షుగర్ వ్యాధి గ్రస్తుల కు ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది


7). జామ పండులో ఉండే విటమిన్లు కంటిచూపును మెరుగు పరచడంలో బాగా ఉపయోగపడుతుంది. కంటిచూపు క్షీణతను నివారించడానికి కాకుండా కంటిలోపల ఉండే శుక్లాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది ఈ జామ పండు.

మరింత సమాచారం తెలుసుకోండి: