మారిన జీవన శైలితో పాటు మనుషుల ఆరోగ్య పరిస్థితులు కూడా మారాయి. ఎక్కువ మంది దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది అధిక రక్తపోటు తో బాధ పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా..... చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది బిపి బారిన పడుతున్నారు. అయితే ఒక్కసారి బిపి వచ్చింది అంటే జీవితాంతం మాత్రలు వాడాల్సిన పరిస్థితి. అందులోనూ బిపి ఉన్న వాళ్ళకి గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది.  అయితే ఈ బిపి ని కంట్రోల్ చేసుకునే విషయంలో వైద్య నిపుణులు చెబుతున్న సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం.

బిపి ఉన్న వారు రోజూ వ్యాయామం చేయాలి. ఆహార విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఉప్పును తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బయట ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.  బిపి ఉన్న వారు వ్యాయామం చేయకపోవడం వలన రక్త ప్రసరణ సరిగా జరగదు .. దీని కారణంగా అనేక వ్యాధులకు గురికావాల్సి వస్తుంది. బీపీ సమస్యతో బాధపడే వారు ఖచ్చితంగా రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ఉత్తమం.  దీని వలన పెరిగిన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అంతే కాకుండా యోగా లేదా ధ్యానం వంటివి కూడా రోజు చేయడం మంచిది.

డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..

బీపీ సమస్యతో బాధపడే వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అధిక సోడియం ఉన్న పదార్థాలను తీసుకోరాదు. ఆకు కూరలను, క్యారెట్ వంటి వాటిని తినాలి. అలాగే ప్రతి రోజూ ఉదయాన్నే ఒక పండ్ల రసాన్ని కానీ కూరగాయల జ్యూస్ కానీ తాగాలి.  ఆల్కహాల్ దరిదాపుల్లో కూడా అస్సలు వెళ్ళకూడదు. బిపి ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి.

బిపి ఉన్న వారు వాకింగ్ చేయడం కూడా మంచిది. కానీ ఏదైనా సరే ఒక రెగ్యులర్ గా మెయింటైన్
చేయగలగాలి. ఇలా చేసినట్లయితే అస్సలు బీపీ తగ్గడానికి ఏ విధమైన మందులు వేసుకునే అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: