ఇక మన జీవన విధానం ఆహారపు, అలవాట్లు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.. ముప్పై ఏళ్ల వయసులో కూడా ఇప్పుడు చాలా మందికి గుండె పోటు సమస్య అనేది చాలా వస్తుంది.. అయితే కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వున్న వారికి అయితే ఈ గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ..ఇక ఏ ఏ బ్లడ్ గ్రూప్స్ వారికి ఈ ప్రమాదం అనేది ఉందో.. ఇక ఏ గ్రూప్స్ వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ రిస్క్ తక్కువో అనేది మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో పూర్తిగా చదివి తెలుసుకుందాం..!ఇక హార్ట్ ఎటాక్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి పరిశోధకులు పలు అధ్యయనాలు చేసి ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను వారు వెల్లడించారు.. కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వున్న వారికి అయితే గుండెపోటు సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుసుకుని వెల్లడించారు. అందులో భాగంగానే ఏబీ బ్లడ్ గ్రూప్ లో ఉన్నవారికి ఈ థ్రోంబోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. వారికి శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తసరఫరా అనేది అసలు సక్రమంగా జరగదు.



అలాగే గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడటాన్ని థ్రోంబోసిస్ అని అంటారు. దీని వలన అనేక రకాల గుండె సంబంధిత వ్యాధులు ఇంకా అలాగే సమస్యలు తలెత్తుతాయి..ఇక యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ గా పిలవబడే O గ్రూప్ వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే మిగతా అన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారు పౌష్టిక ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కూడా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే వారు తినాలి. ఆయా సీజన్లలో లభించే పండ్లు ఇంకా అలాగే కూరగాయలు ఖచ్చితంగా మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. వీటితోపాటు ఖచ్చితంగా ప్రశాంతంగా నిద్ర పోవాలి. ఒత్తిడి కలిగించే వాటికి సాధ్యమైనంత దూరంగా వారు ఉండాలి. ప్రతి రోజు కూడా తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఉండాలి.ఈ పద్ధతులు పాటిస్తే గుండె పోటు వచ్చే సమస్యలు చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులను పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: