ఇక మనం రెగ్యులర్ గా తినే ఆహారపదార్ధాలలో పెరుగు ఖచ్చితంగా ఉంటుంది. ఈ పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్య ఇంకా యోగా నిపుణులు. ఇక ప్రతి రోజూ కూడా 200 గ్రాముల పెరుగు తినడం వల్ల ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చని అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రధానంగా ఈ పెరుగులో “ప్రో బయాటిక్” అనే లైవ్ బ్యాక్టీరియా ఉంటుందట. ఈ బాక్టీరియా వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేయడమే కాకుండా ఇంకా ప్రేగుల్లో పేరుకుపోయిన మలినాలు ఇంకా అలాగే వ్యర్ధాలను పూర్తిగా శుభ్రం చేస్తుందట. అంతేకాకుండా ప్రేగుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో పెరుగు ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.మరీ ముఖ్యంగా పెరుగులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందట. ఈ కాల్షియం వల్ల ఎముకల్లో సాంద్రత పెరిగి ఎముకలు చాలా గట్టిగా ఉంటాయట. అదే విధంగా అధిక రక్త పోటు(హై బిపి) ఉన్నవారికి కూడా పెరుగు చక్కని ఔషదంలా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు.



ఈ పెరుగులో ఉండే పొటాషియం ఇంకా మెగ్నీషియం అధిక రక్త పోటుని నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది చెప్తున్నారు నిపుణులు. పెరుగులో బి 2 ఇంకా బి 12 లాంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని కూడా చెప్తున్నారు.పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది కూడా పుష్కలంగా లభిస్తుందట. దీని వల్ల యుక్తవయస్సు వారిలో వచ్చే మొటిమల సమస్య కూడా ఇట్టే తగ్గిపోతుందని చెప్తున్నారు. ఈ పింపుల్స్ సమస్య ఉన్నవారు రోజుకు 200 గ్రాముల చొప్పున పెరుగుని కనుక తీసుకుంటే సమస్య చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పెరుగుని మధ్యాహ్నం లేదా సాయంత్రం తీసుకుంటే చాలా మంచిదని, రాత్రి పూట మాత్రం పెరుగు తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.పెరుగు వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: