సరైన సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్దకం ఇంకా అలాగే గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి వాటి వల్ల కడుపులో గ్యాస్ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అసలు అంతా ఇంతా కాదు. ఈ సమస్య నుండి బయట పడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. బయట దొరికే సిరప్ లను తాగడం ఇంకా పొడులను నీళ్లలో కలుపుకుని తాగడం వంటి వాటిని చాలా మంది చేస్తుంటారు. వీటి వల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. పైగా వీటిని వాడడం వల్ల దుష్పభ్రావాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక గ్యాస్ సమస్యతో  బాగా బాధపడుతున్నప్పుడు గాలిని ఎక్కువగా పీలుస్తూ వాకింగ్ చేయడం వల్ల కడుపులో ఉండే గ్యాస్ ఈజీగా బయటకు పోతుంది.


నీటిలో పుదీనా ఆకులను ఇంకా అలాగే అల్లాన్ని వేసి బాగా మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు. ఇక మనకు బయట అల్లం మురబ్బా దొరుకుతూనే ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం కూడా దీనిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఇక ఒక ప్లేట్ లో జీలకర్రను తీసుకుని, జీలకర్ర మునిగే దాకా సమానమైన మోతాదులో నిమ్మరసం ఇంకా అలాగే అల్లం రసాన్ని పోసి ఎండబెట్టాలి. ఇక నీరు అంతా కూడా ఆవిరి అయిపోయి జీలకర్ర ఎండిన తరువాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ప్రతి రోజూ కూడా అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: