చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించేందుకు చాలా ఉపయోగపడతాయి. గొంత క్యాన్సర్‌ ఇంకా నోటి క్యాన్సర్‌ ఇతర రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.చాలా మందికి కూడా మతిమరుపు సమస్య ఉంటుంది. గతంలో వయసు మీద పడుతున్నవారికి మాత్రమే ఈ మతిమరుపు సమస్య ఉండేది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మధ్య వయసు నుంచే మతిమరుపు సమస్య బాగా వెంటాడుతోంది.కొంతమందికి తీవ్రమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంటుంది. అలాంటి సమస్యతో బాధపడుతున్నవారికి చేపలు తినడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా గట్టెక్కవచ్చని చెబుతున్నారు. ఈ విషయం 2016లో అమెరికన్‌ శాస్త్రవేత్తలు పలు పరిశోధనల ద్వారా కనిపెట్టారు. అంతేకాకుండా చేపలు తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని, జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుందంటున్నారు.ఇక చేపలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బుల నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు.



చేపలు చాలా ఎక్కువగా తినే వారిలో గుండె సమస్యలు రావని అమెరికన్‌ జర్నల్‌ ఆప్‌ కార్డియాలజీలో ఓ అధ్యయనం ద్వారా తేలింది. చేపలలో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు బ్లడ్ లో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా రక్షిస్తాయి.అలాగే స్త్రీలలో రుతుక్రమం సమస్యకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేపలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.స్త్రీలు తరచుగా చేపలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.అలాగే చేపలలో ఎన్నో మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌ ఇంకా జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.అలాగే చేపలు కొవ్వులు చాలా సులభంగా కూడా జీర్ణమై మంచి శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: