మధుమేహ రోగులు పండ్లు తినాలంటే ఖచ్చితంగా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని చాలా భయపడుతారు. అయితే వీరు తక్కువ గ్లెసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే పండ్లని అయితే తినవచ్చు.ఈ పండ్లు షుగర్‌ లెవల్స్‌ని ఎక్కువగా పెంచవు. 'తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్' అంటే 55 లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది. 'మధ్యస్థ గ్లైసమిక్‌ ఇండెక్స్‌' అంటే 56 నుంచి 69 మధ్య ఉంటుంది. 'అధిక గ్లైసెమిక్ ఇండెక్స్' అంటే 70 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మరి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. అందుకే షుగర్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండ్లని ఎంచుకొని తింటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.


1.చెర్రీ పండు: చాలా రుచికరమైన చెర్రీ యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్ అని ఈజీగా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి ఇంకా ఫైబర్ శరీరంలో జీవక్రియను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల నుంచి కూడా కాపాడుతుంది. చెర్రీపండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని కూడా పెంచదు.


2.రేగుపండ్లు: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రేగు పండ్లు చాలా బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఫైబర్ ఇంకా యాంటీఆక్సిడెంట్లతో పాటు 15 రకాల విటమిన్లు ఇంకా మినరల్స్ ఉంటాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక అంతేకాకుండా రేగుపండు గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ 40. ఇది మధుమేహంతో బాధపడేవారికి ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.


3.ఆరెంజ్: నారింజలో విటమిన్ సి, ఫైబర్ ఇంకా పొటాషియం వంటి ముఖ్యమైన విటమిన్లు ఇంకా ఖనిజాలు ఉంటాయి. అందుకే దీనిని డయాబెటిస్ సూపర్‌ఫుడ్ అని కూడా పిలుస్తారు. నారింజలో ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడంలో కూడా బాగా సహాయపడుతుంది. చాలా కాలం పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా స్థిరీకరిస్తుంది. ఒక నారింజలో 40 నుంచి 43 గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది.


4.యాపిల్: అలాగే యాపిల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక యాపిల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. అందుకే మధుమేహం ఉన్నవారికి ఇది చాలా బెస్ట్‌ అని చెప్పవచ్చు. యాపిల్స్‌లో పెద్ద మొత్తంలో విటమిన్లు ఇంకా మినరల్స్‌తో పాటు ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో చక్కెరను చాలా వేగంగా శోషించడాన్ని నిరోధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: