సాధారణంగా పది మందిలోకి వెళ్ళినప్పుడు నవ్వుతూ మాట్లాడాలి అంటే నోరు ఎంతో ఫ్రెష్ గా ఉండాలి. ఎందుకంటే నోటి నుంచి దుర్వాసన వస్తుంది అంటే.. అప్పుడు మాట్లాడటం కాదు కదా కనీసం నోరు తెరవడానికి కూడా అందరూ ఇబ్బంది పడిపోతుంటారు. ఇక ఇలా నోరు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండడానికి వివిధ రకాల టూత్ పేస్టులు వాడటమే కాదండోయ్ మౌత్ ఫ్రెషనర్ లను కూడా వెంటే  పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. అయినప్పటికీ నోటి దుర్వాసన మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇలా నోటి దుర్వాసన కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలీ.



 కొంతమంది నోటి దుర్వాసనను పోగొట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మాత్రం ఫలించక తల పట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తిన్న వెంటనే నీరు అస్సలు తాగవద్దు. అలా చేయడం కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుందట. అంతేకాదు దంతాలలో మురికి పేరుకు పోకుండా ఉండేందుకు డాక్టర్ దగ్గరికి వెళ్లడం లేదా స్పెషలిస్ట్ వద్దకు వెళ్లడం మంచిది అని  చెబుతున్నారు నిపుణులు.


 లేదంటే మార్కెట్లో లభించే టూత్ పిక్ లను కూడా ఉపయోగించి నోటిని శుభ్రం చేసుకోవచ్చు అంటూ సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇక ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా కూడా శ్వాస తీసుకోవడం వల్ల దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుందట. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల లాలాజలం ఏర్పడకుండా ఉంటుంది. తద్వారా దుర్వాసన వస్తుందట. దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అల్పాహారం తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా దుర్వాసన వస్తుందని అంటున్నారు. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల నోటి దుర్వాసనకు దూరంగా ఉండవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి: