ఇక వివిధ ప్రభుత్వ ఆహార పథకాలకు పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం సురక్షితం కాదని ఓ నివేదిక వెల్లడించింది. గ్రీన్ పీస్ చే రూపొందిన వాస్తవ-నిర్ధారణ నివేదికలో ఫోర్టిఫికేషన్ ప్రభావవంతగా లేదనే విషయం నిరూపితమైంది.గత సంవత్సరం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు పథకాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యాన్ని వచ్చే మూడేళ్లలో అంటే 2024 నాటికి బలపరుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ ఇంకా అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ప్రారంభించింది. అలాగే సూక్ష్మపోషకాల లోపాన్ని పరిష్కరించడానికి సరఫరా చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం ఖర్చుతో కూడా కూడుకున్నది. సాధారణ బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇంకా విటమిన్ బీ-12 ఉంటాయి. కాబట్టి సరైన అవగాహన ఇంకా సూచనలు లేకుండా ఫోర్టిపైడ్ బియ్యాన్ని తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ బియ్యాన్ని తింటే తీవ్ర ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.సాధారణంగా మన శరీరానికి అవసరమైన ఇనుము మనం తినే పదార్థాల నుంచి బాగా లభిస్తుంది. ఇనుము వాడకం అధికమైతే ఆక్సీకరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తలసేమియా ఇంకా సికిల్ సెల్ అనీమియా వచ్చే పరిస్థితులు తలెత్తుతాయి.



 శరీరంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉండటాన్ని హేమోక్రోమాటోసిస్ అంటారు. ఐరన్ కాలేయం, ప్లీహం ఇంకా ప్యాంక్రియాస్‌లో కూడా పేరుకుపోతుందని, ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి లేదా ప్యాంక్రియాటైటిస్‌కు కారణమవుతుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అందించే ఉచిత పథకాలు చాలా వరకు గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వారికి పోషకాలతో కూడిన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న విషయాన్ని గమనించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.వాస్తవానికి గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి దేశంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీని కేంద్రం చేపట్టింది.ఇది ఎఫ్‌సీఐ ద్వారా అర్హులకు అందిస్తోంది. పోర్టిఫైడ్‌ బియ్యంలో ఐరన్‌ ఇంకా ఫోలిక్‌ యాసిడ్‌తోపాటు విటమిన్‌ బీ12, విటమిన్‌ 2, విటమిన్‌ ఏ ఇంకా జింక్‌తోపాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయని బీఐఎస్‌ ప్రకటించింది. అయితే తాజాగా ఈ బియ్యం చాలా హానికరం అని అధ్యయనాలు తేల్చడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: