వేప చాలా కాలంగా అనేక వ్యాధులను నయం చేస్తూ ఉంటుంది. భారతదేశంలో దాదాపుగా ప్రతి ఇంటికి వేపకు ఔషధ గుణాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. వేపకు సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇదే సమయంలో జుట్టు పెరుగుదలకు కూడా సహాయ పడుతూ ఉంటుంది. వేప పుల్లలతో పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల అనేక ఈ రోగాల నుండి బయట పడవచ్చు. అందుచేతనే పలు కంపెనీలు సంస్థలు కూడా పేస్ట్ లో ఎక్కువగా వేపాకు ఉండేలా చూసుకుంటూ ఉంటారు. వేపాకు ఆకులు తినడం వల్ల ఏదైనా వ్యాధి నుండి త్వరగా బయటపడవచ్చు. వేపాకును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వేపాకు 130 కంటే ఎక్కువ రోగాలను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. వేప వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1). వేప పుల్లలు ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. తాజా వేప ఆకులను మెత్తగా నూరి తేనెలో కలుపుకొని తినడం వల్ల అనేక రోగాలు కూడా మటుమాయమవుతాయి. అయితే అధికంగా వేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరమే.

2). వేప ఆకులను నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరం లోపల రక్త శుద్ధి కూడా పరిగణించబడుతుంది అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. మొటిమలు సమస్యతో ఉండేవారు వేప సిరప్ ఉపయోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

3). మార్కెట్లో దొరికే వేప సబ్బులు, షాంపూలు అందుబాటులో ఉన్నాయి.. వీటికంటే వేపాకులను బాగా నూరి తలకు పట్టించుకుని స్నానం చేయడం మంచిది అని తెలియజేశారు. దీనిపై చుండ్రు కూడా తగ్గిపోతుందని జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నారు నిపుణులు. వేప పుల్లలు చిగుళ్ళకు కూడా మంచిదని తెలియజేస్తున్నారు. ఇక వేపచెక్క వల్ల పలు గాయాల చోట వాటిని బాగా నూరి పేస్టులాగా పట్టిస్తే ఇది యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: