ఇక నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో కూడా ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల చాలా మంది కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.ఎదుటి వారికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు.అలాగే నిద్రపోయేవారు గురక నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మేలంటున్నారు వైద్య నిపుణులు. గురక రావడానికి ప్రధాన కారణాలు ఇంకా అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక అనేది వస్తుంది. అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు అనేవి వస్తాయి. అయితే కేవలం ఇది ఒక్క కారణం మాత్రమే. ఇక ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు ఇంకా విపరీతమైన ఆలోచనాధోరణి.


ఇక ప్రతిరోజూ కూడా రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుందట.అలాగే అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం అనేది కనిపిస్తుంది.ఇంకా అలాగే ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే కూడా గురక తగ్గుతుంది.అలాగే ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్రపోతే తప్పకుండా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: