చాలామంది పచ్చి కూరగాయలను సలాడ్ గా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కీర దోసకాయ, టమోటా, క్యాబేజీ వంటి వాటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని సలాడ్లలో ఉపయోగిస్తూ ఉంటారు. కూరగాయలు పచ్చగా ఉండటం వల్ల అందులో విటమిన్లు, మినరల్స్ వంటి ప్రయోజనాలు లభించవు.. ఇక అందుచేతనే వీటిని ఉడకబెట్టి ఆవిరి పట్టడం లేదా కాల్చి తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇందులో కొన్ని మాత్రం పచ్చిగా తినకూడదు వాటి గురించి చూద్దాం.


1). పచ్చి బెండకాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పచ్చి బెండకాయ తినడం వల్ల వాంతులు కడుపులో తిమ్మిర్లు వంటివి వస్తాయి. బెండకాయలలో ఉండే సోలనిన్ వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. అందుచేతనే బెండ కాయలను బాగా ఉడికించి తినాలి.

2). పాలకూరలో ఎక్కువగా ఫోలేట్ ఉండడం వల్ల దీనిని పచ్చిగా ఎప్పుడూ తినకూడదు. ఎల్లప్పుడు ఆవిరిమీద ఉడికించి మాత్రమే వీటిని తినాలి.

3). ఎల్లప్పుడూ కూడా పుట్టగొడుగులను పచ్చిగా తినకూడదు. కేవలం వీటిని ఉడికించి మాత్రమే తినాలి. దీనిని ఉడికించి తినడం వల్ల ఇందులో పలు పోషకాలు అందుతాయి. పుట్టగొడుగులను డ్రై చేయడం లేదా ఉడకబెట్టడం వల్ల పొటాషియం బాగా సమృద్ధిగా పెరుగుతుంది.


4). పచ్చి బంగాళా దుంప ల లో సొలనిన్ అని టాక్సిన్ ఉండడం వల్ల వీటిని పచ్చిగా తింటే.. గ్యాస్ సమస్య లు, జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అందుచేతనే బంగాళదుంపను ఉడికించి లేదా వేయించి మాత్రమే తినాలి.


పచ్చిబఠాణీలు వీటిని తినడం వల్ల, మన శరీరంలో జీర్ణం కాకుండా మిగిలిపోతుంది. అందుచేతనే వీటిని కూడా ఎప్పుడైనా ఉడికించి లేదా వేయించి మాత్రమే తినాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చివి తినకూడదు. ముఖ్యంగా మార్కెట్లో దొరికేటువంటి వాటిని ఉడికించకుండా తింటే చాలా ప్రమాదం.

ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: