సాధారణంగా ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలలో తోటకూర కూడా ఒకటి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తోటకూర లో ఉండే పోషకాల వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుంది అంటే తల్లి కూడా అంత మేలు చేయదు అని చెబుతారు పెద్దలు. ఇకపోతే ఆకుపచ్చని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందని మనం వింటూనే ఉంటాం.. ఇక పాలకూర, మెంతి కూర, క్యాబేజీ వంటి వాటికి చాలా మంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ తోటకూర తినే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా తోటకూరను ప్రతి రోజు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.


తోటకూర ప్రతిరోజూ తింటుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా శరీరానికి లభిస్తుంది. టోకోట్రెనోల్స్ అనే ఒక రకమైన విటమిన్ ఇ కూడా తోటకూర లో మనకు లభిస్తుంది. ఇక తోట కూర తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి ,బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా యాంటీ హైపర్ గ్లైసెమిక్ గా  తోటకూర పనిచేస్తుంది. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి టైప్ 2 డయాబెటీస్ వారికి సహాయ పడుతుంది. ఇన్సులిన్ స్థాయిలు రక్తంలో తగ్గిస్తుంది. కాబట్టి  ఆకలిని తగ్గించే హార్మోన్ కూడా  రిలీజ్ చేస్తుంది కాబట్టి వెంటనే ఆకలి గా అనిపించదు.


ఇక తోటకూరలో లభించే కాల్షియం కారణంగా ఎముకలు దృఢంగా మారుతాయి. తోటకూర తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు ఇక కీలకమైన లైసైన్ కూడా తోటకూరలో లభిస్తుంది. ఇక పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఈ, పాస్ఫరస్ , పొటాషియం, ఐరన్ ,మెగ్నీషియం , విటమిన్ సి వంటి పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ , క్యాన్సర్ కణాలపై పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి పోషకాలు అధికంగా ఉండే తోటకూర ను  ఎక్కువగా తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: