లవంగాలలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో దోహదపడతాయి. అలాగే ఇవి యాంటీ మైక్రో బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. లవంగాలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి ఇంకా అలాగే అతిసారం వంటి సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి. ఇంకా అలాగే అంటు వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాలను నిరోధించే శక్తిని కూడా ఈ లవంగాలు కలిగి ఉంటాయి. టీ ట్రీ నూనెను ఇంకా అలాగే లవంగాలను కలిపి ఉపయోగించడం వల్ల దంతాల సమస్యలు ఇంకా చిగుళ్ల సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అలాగే కాలేయ పని తీరును మెరుగుపరచడంలో కూడా లవంగాలు మనకు ఉపయోగపడతాయి.అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులకు లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు ప్రతి రోజూ ఉదయం 6 లేదా 7 లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి 15 నిమిషాల పాటు వేడి చేసి ఆ నీటిని వడకట్టి రోజూ పరగడుపున తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.


కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి. లవంగాల నుండి తీసిన నూనెను నొప్పులు ఉన్న చోట రాసి మర్దనా చేయడం వల్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఈ నూనె అందుబాటులో లేని వారు లవంగాలను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నొప్పులపై రాయడం వల్ల కూడా కీళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. రోజూ ఒక టీ స్పూన్ లవంగాలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకల పగుళ్లు రాకుండా ఎముకలు దృఢంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే పంటి నొప్పితో బాధపడే వారు కొన్ని లవంగాలను నమలడం వల్ల నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ లవంగాలు యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని పేస్ట్ గా చేసి కాలిన గాయలాపై ఇంకా తెగిన గాయాలపై రాయడం వల్ల ఆ గాయాలు త్వరగా మానుతాయి. కడుపులో అంతర్లీనంగా ఉండే రక్షణ పొర కొన్నిసార్లు దెబ్బతిని అల్సర్లు అనేవి ఏర్పడతాయి. లవంగాల నూనెను వాడడం వల్ల ఈ అల్సర్లు తగ్గడమే కాకుండా కడుపులో ఉండే రక్షణ పొర దెబ్బతినకుండా కూడా కాపాడుతుంది. కొందరికి ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వాంతులు అవుతాయి. అలాంటి వారు ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం వల్ల అలా వాంతులు అవ్వకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: