మధుమేహ వ్యాధితో చాలా ఎక్కువగా బాధపడే వారు తుమ్మి కూర ఆకులను, తులసి ఆకులను, మారేడు ఆకులను ఇంకా అలాగే వేప ఆకులను విడివిడిగా నీడలో ఎండబెట్టి పొడిగా చేసి అన్నింటినీ కలిపి వస్త్రంలో వేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఆహారం తీసుకోవడానికి అర గంట ముందు రోజుకు రెండు పూటలా కూడా మధుమేహ తీవ్రతను బట్టి అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక అర గ్లాసు కాచి చల్లార్చిన నీటిలో కలిపి తాగడం వల్ల మధుమేహం చాలా ఈజీగా హరించుకుపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేలు ఇంకా పాము కాటు వంటి విష జంతువులు కాటు వేసినప్పుడు తుమ్మి కూర ఆకులను నుండి రసాన్ని తీసి కాటు గురి అయిన ప్రదేశంలో వేసి ఆ ఆకుల ముద్దను దాని పై అలాగే ఉంచి కట్టుకట్టాలి. ఇక ఈ ఆకుల రసాన్ని కూడా రెండు టీ స్పూన్ల మోతాదులో తాగించాలి. అలాగే ఈ రసాన్ని 4 చుక్కల మోతాదులో ముక్కులో కూడా వేయాలి. ఇలా చేయడం వల్ల పాము ఇంకా తేలు విషాలు హరించుకుపోతాయి.ఇంకా అలాగే స్త్రీలలో బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించి గర్భాశయం శుద్ది అయ్యేలా చేయడంలో కూడా తుమ్మి కూర మొక్క ఉపయోగపడుతుంది.


పావు టీ స్పూన్ తుమ్మి ఆకుల పొడిని ఇంకా పావు టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి రెండు పూటలా అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి బహిష్టు ప్రారంభమైన రోజు నుండి మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల నొప్పి అనేది ఇక తగ్గడమే కాకుండా గర్భాశయం కూడా బాగా శుద్ధి అవుతుంది. ఈ మూడు రోజులు కూడా వారు బియ్యం, పెసరపప్పు, పాలు, నెయ్యి ఇంకా అలాగే కండ చక్కెరను కలిపి చేసిన దానినే ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. ఇక ఈ విధంగా తుమ్మి కూరను ఉపయోగించడం వల్ల, దీనిని మితంగా కూరగా వండుకుని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: