ఇక ప్రస్తుతం చాలా మంది కూడా చల్లని ఉష్ణోగ్రతలు ఉన్న ఆహార పదార్థాలను సురక్షితమైనదిగా భావిస్తున్నారు.ఎందుకంటే చల్లని ఇంకా గడ్డకట్టే ఉష్టోగ్రతల కారణంగా ఆహారాన్ని పాడుచేసే సూక్ష్మజీవుల కదలికలు ఆగిపోతాయి. దీని వల్ల ఆహారం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.నిత్యం చాలా మంది తరచుగా పచ్చి మాంసం, కొన్ని కూరగాయలు ఇంకా ఆహారాలను తక్కువ ఉష్ణోగ్రత కోసం ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే కొన్ని వస్తువులను మాత్రం చల్లని ప్రదేశాల్లో ఉంచడం వల్ల అవి చెడిపోకుండా ఉంటే.. మరి కొన్ని మాత్రం చెడి పోతున్నాయి. ఇక అంతేకాకుండా మరి కొన్ని అయితే విషపూరితంగా మారుతున్నాయి.కావున కొన్ని రకాల ఆహారాలను అస్సల గడ్డకట్టే ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఇక టమోటాలను ఎప్పుడు కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీటిని కేవలం గదిలో ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే ఉంచాలి. ఇలా చేయడ వల్ల కూరల్లో వీటిని వినియోగించినప్పుడు రుచి అనేది పోకుండా ఉంటుంది. టమోటాలను చల్ల ఉష్ణోగ్రతల్లో ఉంచడం వల్ల రుచి తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక వేళా వీటిని ఫ్రిజ్‌లో ఉంచిన మళ్ళీ వండుకునే గంట ముందు బయట తీసి ఉంచాలి.ఇక ప్రస్తుతం అయితే చాలా మంది ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారు.


ఇలా చేయడం వల్ల అవి చాలా తొందరగా చెడిపోయే అవకాశాలుంటాయి.అయితే ఎప్పుడూ కూడా అసలు పై తొక్క లేని ఉల్లిపాయలను తక్కువ ఉష్ణోగ్రత మధ్య ఉంచకూడదు.ఇంకా నిత్యం వంటకాల్లో వినియోగించే గింజలను కూడా చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే సువాసనలు ఇంకా రుచి తొలగిపోతాయి. ఇక అంతేకాకుండా శరీరానికి అందాల్సిన పోషకాలు కూడా తొలగిపోతాయి.అలాగే వంటకాలకు రుచిని కలిగించే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. ప్రస్తుతం దీనిని కూడా చాలా మంది కూడా ఫ్రిజ్‌లో తక్కువ ఉష్ణోగ్రత మధ్య ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల అవి మొలకెత్తి ఇంకా ఓ ప్లాస్టిక్‌ రబ్బర్‌లా తయారవుతున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత వీటిని బయట సాధరణ ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల కూడా చెడిపోతున్నాయి. కాబట్టి సాధరణ ఉష్ణోగ్రత మధ్య ఉంచడం మంచిది.ఇంకా బంగాళదుంపలను కూడా చాలా మంది ఫ్రిజ్‌లో ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల దుంపలోని పిండిని పదార్థాలు చక్కెరగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అంతేకాకుండా తేమ వల్ల చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి వీటి సాధరణ ఉష్ణోగ్రతల మధ్య ఉంచడం మంచిది.ఇంకా తేనెలో అనేక రకాల ఔషధ మూలకాలుంటాయి. కావున దీనిని ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని బయట ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల స్మూత్ గా, ఫ్రెష్ గా ఉంటుంది. అయితే దీనిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: