మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మంచి సంకేతం కాదు. ఇది శరీరంలో రక్త ప్రసరణకు పెద్ద ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఇక దానికంటే ముఖ్యంగా.. గుండె సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అయితే, ఇక్కడ వున్న సమస్య ఏంటంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయని మనం త్వరగా అర్థం చేసుకోలేం. కొలెస్ట్రాల్ అనేది పెద్ద సైలెంట్ కిల్లర్. కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వలన అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.ఇక రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు, రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. కాళ్లకు ఆక్సిజన్‌ అనేది సరిగ్గా అందదు. దాని ఫలితంగా.. కాలి కండరాలలో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది కొలెస్ట్రాల్‌కు సంకేతం. చాలా సందర్భాలలో కూడా కొలెస్ట్రాల్ కాళ్ళ స్నాయువులను ప్రభావితం చేస్తుంది.


కాళ్లలో అసాధ్యమైన నొప్పి కూడా వస్తుంది. ఈ రకమైన నొప్పి తొడలు లేదా మోకాళ్ల క్రింద ఇంకా వెనుక భాగంలో ఎక్కువగా ఉంటుంది. నడిచేటప్పుడు కూడా నొప్పి మరింత పెరుగుతుంది.ఇంకా అలాగే కొలెస్ట్రాల్ పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PDA) వచ్చే అవకాశం కూడా బాగా పెరుగుతుంది. ఇక అదే జరిగితే.. స్పీడ్‌గా పరుగెత్తడం కాదు కదా.. కనీసం నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకా శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.అలాగే చాలా సార్లు కూడా దవడలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇంకా ఆహారాన్ని నమలడం కూడా కష్టంగా మారుతుంది. మన గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు, దవడలో సమస్య అనేది ఏర్పడుతుంది. దవడ నొప్పి నుండి ఛాతీ నొప్పి కూడా బాగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఇంకొన్ని సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: