సాధారణంగా డాక్టర్ లు ప్రతి రోజూ ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్యం అందించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డాక్టర్ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్కు ఉన్న సమస్య డాక్టర్లకు కొత్తగా అనిపించదు. ఇలాంటి సమస్య ఉన్న పేషెంట్లు ఇప్పటి వరకు ఎంతోమంది నా దగ్గరికి వచ్చారులే అని అనుకుంటూ ఉంటారు డాక్టర్లు. ఇక అది పేషెంట్లకు పెద్ద సమస్య అయినా డాక్టర్లకు మాత్రం రెగ్యులర్ సమస్యగానే చూస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా డాక్టర్లను సైతం నివ్వెరపోయేలా చేసే పేషెంట్స్  కొంత మంది వస్తూ ఉంటారు.


 అప్పటి వరకు డాక్టర్లు కలలో కూడా ఊహించని సమస్యతో బాధపడుతూ చివరికి డాక్టర్ దగ్గరికి రావడంతో.. వారికి పరీక్షలు నిర్వహించి అప్పటికే వేల మందికి వైద్యం చేసిన వైద్యులు సైతం అవాక్కవుతు ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇక ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కొంత మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పుట్టుకతోనే ఒక కిడ్నీ తో పుడతారు. ఇక్కడ జరిగిన ఘటన మాత్రం ఇందుకు భిన్నమైనది అని చెప్పాలి. ఒక వ్యక్తికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిడ్నీలు ఉన్నాయి.


 ఈ విషయం తెలిసి డాక్టర్లు సైతం అవాక్కయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కు చెందిన వ్యాపారి సుశీల్ గుప్తాకు మూడు కిడ్నీలు  ఉన్నాయి. ఇక  అతన్ని పరీక్షించిన వైద్యులు వైద్య ప్రపంచంలోనే ఇటువంటి కేసులు చాలా అరుదు అంటూ చెబుతున్నారు. మూడు కిడ్నీలు ఉన్నప్పటికీ అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు అంటూ వైద్యులు తెలిపారు. ఇలాంటి తరహా సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. అయితే తొలిసారిగా పిత్తాశయం ఆపరేషన్ కోసం ఆల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి ఉందని అప్పుడే తన శరీరంలో మూడు కిడ్నీలు  ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది అంటూ సుశీల్ గుప్తా చెబుతున్నాడు. ఎడమవైపు రెండు కిడ్నీలు కుడివైపు ఒక కిడ్నీ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: