చాలామందికి ఈమధ్య ఎక్కువగా నోటి దుర్వాసన వస్తూ ఉండడంతో చాలామంది బాధపడుతూ ఉన్నారు ఈ సమస్య వల్ల మనలో చాలామంది కుమిలిపోతూ ఉన్నారు. నోటి దుర్వాసన వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు పక్కవారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది.. దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా ఇలాంటి వాసన వస్తుంది అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఏవైనా నూనె వస్తువులు ఊపిరితిత్తులకు చేరినప్పుడు ఎక్కువగా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుందట. అయితే ఇది నోటి దుర్వాసన కలిగించకుండా ఉండే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1). నిమ్మకాయ,యాపిల్, నారింజ వంటి కాయలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది బ్యాక్టీరియాను కంట్రోల్ చేయడమే కాకుండా చిగుళ్ల వ్యాధులు చిగురు వాపుతో పోరాడడానికి చాలా సహాయపడుతుంది.

2). ఇక పెరుగులో ఎక్కువగా ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి ఇది నోటిలోని ఉండే చెడు దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను నశింపచేస్తాయి. అంతేకాకుండా విటమిన్ ఇందులో పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో క్రిములు పెరగకుండా తగ్గిస్తూ ఉంటుంది.

3). అల్లం తో చేసేటువంటి వాటిని తిన్నా సరే ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు విచ్చినం చెంది లాలాజలం ఎంజైమును అందిస్తుంది.. దీంతో నోటి దుర్వాసనను కంట్రోల్ చేయవచ్చు.

4) ఇక పుదీనా, తులసి వంటి ఆకులను వారంలో కనీసం రెండుసార్లు అయినా నమిలి తినడం వల్ల.. నోటి దుర్వాసన నివారించవచ్చు.

5). తరచూ వేపాకు ఆకులను తింటూ వేపాకు పుల్లలతో పళ్ళు తోమడం వల్ల.. నోటి దుర్వాసననుండి విముక్తి పొందవచ్చు.. ఇక ఇందులో ఉండే చేదు  వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది.

అయితే కొంతమంది రాత్రి భోజనం చేసిన తర్వాత.. పళ్ళు తోముకోవడం వల్ల కూడా దుర్వాసన తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: