రక్తదానం చేయడం వలన ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి అన్న విషయం తెలిసిందే. మీరు చేసే రక్తదానం అపాయంలో ఉన్న వ్యక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం ఎన్నో రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉంటాయి. అయితే రక్తదానం ఎవరు చేయాలి ? ఎవరు చేయకూడదు ? అనే విషయం పై చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒకటి మధుమేహం (డయాబెటిస్) ఉండే వారు రక్తదానం చేయొచ్చా లేదా అన్నది కూడా ఒకటి. అయితే ఇపుడు దాని గురించి తెలుసుకుందాం.

కాగా డాక్టర్లు చెబుతున్నది ఏమిటి అంటే... మధుమేహం ఉన్న రోగులు కూడా రక్తదానం చేయవచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల కొరకు రక్తదానం చేయడం సురక్షితమే అంటున్నారు. కానీ వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క మధుమేహం కంట్రోల్ లో ఉండి, మరే ఇతర... వ్యాదులు కనుక లేనట్లయితే ఒకసారి వారి డాక్టర్ ని కలిసి  వారి సలహా తీసుకుని రక్తదానం చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వ్యక్తులు కనుక రక్తదానం చేయదలిస్తే ఒకసారి డాక్టర్ ని కలిసి వారి సలహా మేరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని రక్తదానం చేయడం మంచిది.

మధుమేహం ఉన్నవారు పలు జాగ్రత్తలు తీసుకుని రక్తదానం చేయడం సురక్షితం.  రక్తదానం చేసే ఒక వారం ముందు నుండే  ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం మంచిది. అదే విధంగా రక్తదానం చేసే ముందు పుష్కలంగా నీరు తాగాలి.  రక్తదానం చేసే ముందు కనుక మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోతే వైద్యుని తప్పక సంప్రదించి, వారి సలహా మేరకే రక్తదానం చేయాలి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుని రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: