ఇక కండరాల్లో దృఢత్వం సమస్య వలన తిమ్మిర్లు నొప్పి చాలా బాధాకరంగా మారుతుంది. కాలు తిమ్మిర్లు రావడానికి అనేక కారణాలు అనేవి ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక వ్యాయామం , బరువు పెరగడం లేదా శరీరంలో నీరు లేకపోవడం ఇంకా రక్త ప్రసరణలో సమస్యల కారణంగా కాళ్ళ తిమ్మిరి ఏర్పడవచ్చు. మీరు తరచుగా కాలు తిమ్మిరిని ఎదుర్కొంటూ నొప్పి పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. కొన్ని పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అయినప్పటికీ.. ఇంట్లోనే సహజంగా కూడా కాళ్ళ తిమ్మిరి నుంచి ఉపశమనం పొందవచ్చు.ఇక కాళ్ల నొప్పులతో బాధపడేవారిలో ఎక్కువగా పోషకాలు లోపించి ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం ఇంకా పొటాషియం వంటి అనేక మూలకాల లోపం మీ సమస్యను మరింత పెంచుతుంది.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి పోషకాలను అందించే ఆహారాన్ని తినండి.విటమిన్ డి ఇంకా క్యాల్షియం లోపం వల్ల కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇక ప్రతిరోజూ వేడి పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. పాలు మంచి కాల్షియం ఆహారం. ఎముకలను, కండరాలను చాలా బలంగా చేస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పసుపు పాలు త్రాగండి, అయితే త్రాగేటప్పుడు వాటిని పరిమితిగా తీసుకోండి.ఇక వేడి నీటితో స్నానం చేసే అలవాటు మీకు అనేక ప్రయోజనాలను తెస్తుంది. వాటిలో ఇక ఒకటి కాళ్ళ తిమ్మిరి సమస్య నుండి ఉపశమనం.ప్రతి రోజూ పాదాలపై గోరువెచ్చని నీటిని పోసుకుని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాదాల్లో రక్తప్రసరణను అడ్డుపడే సిరలు తెరుచుకోవడంతోపాటు కండరాలు కూడా చాలా రిలాక్స్ అవుతాయి. అలాగే రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఈ పద్ధతి మీ శరీరాన్ని బాగా రిలాక్స్‌ చేస్తుంది.కాబట్టి తిమ్మిర్లు తగ్గాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: