నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టురాలడం అనే చెప్పాలి . మగవారి దగ్గర నుంచి ఆడవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత చిన్న వయస్సులోనే బట్టతల రావడం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే బట్టతల ఉందని పెళ్లి కూడా జరగని పరిస్థితి ఏర్పడింది.. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల షాంపులను హెయిర్ ఆయిల్ ను వాడుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక మరికొంతమంది కాస్త ఒక అడుగు ముందుకు వేసి గుండు కొట్టించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా జుట్టు రాలిపోవడం సమస్యతో బాధపడుతున్నవారు గుండు కొట్టించుకుంటే ఎక్కువగా వెంట్రుకలు వస్తాయని ఎంతోమంది గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అంతేకాదు తరచు దువ్వెనతో దువ్వుతూ ఉండడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుందని ఎంతో మంది నమ్మకం. ఇందులో నిజం ఎంత ఉంది అని నిపుణులను అడిగితే గుండు కొట్టించడం కారణంగా జుట్టు పెరుగుతుంది అన్న దానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు అంటున్నారు నిపుణులు. జుట్టు రాలే సమస్య ను కూడా గుండు  కొట్టుకోవడం వల్ల నయం కాదట.


 కానీ గుండు కొట్టించు కోవడం వల్ల జుట్టుకు ఎన్నో లాభాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. గుండు కొట్టించుకోవడం  ద్వారా పూర్తిగా తలపై పేరుకుపోయిన చుండ్రు దుమ్ము ధూళి అన్ని కూడా బయటికి వెళ్లిపోతాయి. అంతేకాదు తలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తద్వారా ఇక జుట్టు కాస్త బలంగా  మారుతుందట. అయితే  తరచు గుండె కొట్టుకోవడం వల్ల జుట్టు ఎక్కువగా పెరుగుతుంది అన్నది మాత్రం నిజం కాదు అని అంటున్నారు.  అయితే నిపుణుల ఎంత చెప్పినప్పటికీ అటు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం గుండు కొట్టించు కోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని గట్టిగా నమ్ముతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: