మన శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల పలు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు చాలా ఇరుకుగా మారిపోయి శరీరమంతా కూడా రక్తప్రసరణ అనేది సక్రమంగా జరగదు.దీని వల్ల పలు వ్యాధులు తలెత్తుతాయి. కొన్నిసార్లు కొలెస్ట్రాల్  ధమనులలో పేరుకుపోతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అయితే వైద్యుల సలహాలతో పాటు కొన్ని ఇంటి చిట్కాలతో రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు.ముఖ్యంగా ఉదయం పరగడుపునే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, రెండు-నాలుగు బాదం గింజలు, అలాగే 8-10 ఎండుద్రాక్షలను అర గిన్నె ఓట్స్‌తో ప్రతిరోజూ రాత్రి నానబెట్టి, ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో నిల్వ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.ఎండుద్రాక్షలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయులను తగ్గిస్తాయి. ఇక ఎండుద్రాక్షలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి.


మెంతుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెంతులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతాయి. అలాగే ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు, ఇనుము, కాల్షియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.పొద్దుతిరుగుడు గింజల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆహారంలో సోయాబీన్స్‌కు బదులుగా సన్‌ఫ్లవర్‌ నూనెను ఉపయోగించడం మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: