ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా ఎక్కువగా అధిక బరువు సమస్యతో బాద పడుతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయిన కూడా బరువు తగ్గక పోవడం తో అన్నం తినడం మానేయడం లాంటివీ చేస్తుంటారు.ఇంకొంతమంది జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ జిమ్ కి వెళ్లడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలి అనుకునేవారికి రాత్రి పూట అన్నం లేదా చపాతి తినడం ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో తెలీక తికమకపడుతుంటారు. మరి ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఏదైనా కూడా ఏ ఆహారమైనా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.అయితే అది అన్నమా లేక చపాతీనా అనేది పక్కన పెడితే.. మనం తృప్తిగా తిన్నామా లేదా అన్నది ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. అలా ఏదైనా కూడా మన కు ఇష్టం అని పించినది తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని చెబుతున్నారు. ఇష్టంలేని ఆహారం బలవంతంగా తినడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు మొదట చేసే పెద్ద తప్పు పూర్తిగా డైట్ మార్చేయడం. పూర్తిగా అన్నం తినడం మానేయడం.. లేదా చపాతీ తినడం మానేయడం లాంటివి చేస్తారు.


అప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా తింటున్న ఆహారాన్ని ఒక్కసారిగా ఎవాయిడ్ చేయడం మంచిది కాదు.అయితే చపాతీ, అన్నం రెండూ వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి. చపాతీ తినడం రోజంతా కడుపుని నింపుతుంది. ఇక అన్నంలో ఉండే పిండి పదార్ధం తొందరగా జీర్ణం అవుతుంది. ఇక ఈ రెండింటిలో ఉండే తేడా సోడియం లెవల్స్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. బియ్యం చపాతీ కంటే తక్కువ ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వు కలిగి ఉంటుంది, కాని బియ్యం లోని కేలరీలు చపాతీ కంటే ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పాటు, నీటిలో లభించే విటమిన్లు ఆరోగ్యానికి మంచివి. ఇంకా అలాగే సులభంగా జీర్ణమవుతాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఉదయం టిఫిన్ చేసే సమయం వరకు మధ్యలో ఎక్కువ గంటల సమయం ఉంటుంది. అందుకే అన్నం తింటే త్వరగా అరిగిపోయి మళ్లీ ఆకలివేస్తుంది. అదే చపాతి తింటే తేలిగ్గా ఆకలి ఎక్కువ వేయదు.కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఫస్ట్ ఈ పని చెయ్యండి. ఖచ్చితంగా అధిక బరువు తగ్గి హెల్దిగా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: