శిలాజిత్ మూలిక గురించి ఎవరికి అంతగా తెలీకపోవచ్చు. ఇది ఒక జిగట పదార్థం. ఇది హిమాలయాల్లోని శిలల్లో లభిస్తుంది. అందుకే దీనిని శిలాజిత్ అని పిలుస్తున్నారు. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. శృంగార సామర్థ్యాన్ని పెంచటానికి, లైంగిక జీవితాన్ని మెరుగుపరచటానికి శిలాజిత్ ఔషధాన్ని మోతాదు మేరకు అందిస్తారు. ఇది తీసుకున్నప్పుడు అలసట, బద్ధకం పోయి ఉత్సాహం ఉరకలేస్తుందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. మరి పురుషులతో పాటు మహిళలకు ఈ శిలాజిత్ మూలిక బాగా ఉపయోగపడుతుంది.ఇంటి పనులతో మహిళలు తరచుగా అలసిపోతూ ఉంటారు. స్త్రీల పీరియడ్ సమయంలో తమ శరీరం నుండి చాలా పోషకాలను, శక్తిని కోల్పోతారు. అటువంటప్పుడు శిలాజిత్ మూలిక తీసుకుంటే అది శరీరంలో అడెనోసిన్-5-ట్రిఫాస్ఫేట్ -ATPని ఉత్పత్తి చేస్తుంది. దీంతో శక్తి తిరిగి వస్తుంది. అంతేకాకుండా మంచి మూడ్ లోనూ ఉంటారు, రోజంతా చురుకుగా ఉండేందుకు ఈమూలిక దోహదపడుతుంది. ఇంకా అలాగే నెలసరి సమస్యలతో చాలా మంది మహిళలు బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల వల్ల స్త్రీలు వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది.


ఆయుర్వేద వైద్యం తీసుకున్నప్పుడు మహిళల్లో సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి శిలాజిత్‌ను సిఫార్సు చేస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. శిలాజిత్ మూలిక అవసరమైన యాంటీఆక్సిడెంట్లను ఉత్పత్తి చేయడం ద్వారా అవయవాలను శుభ్రపరుస్తుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, స్త్రీలలో వంధ్యత్వాన్ని నివారిస్తుంది.శిలాజిత్ మూలిక అరుదైన వైద్య లక్షణాలకు ప్రసిద్ధి. దీనిని తినడం వల్ల ప్రశాంతత పొందవచ్చు. ఇది ఆనందంగా ఉన్నప్పుడు శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిని మంచి, ఉల్లాసమైన, సంతోషకరమైన మూడ్‌లో ఉంచుతుంది.రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే శక్తి శరీరంలో లేకుంటే, వైరస్‌లు, బాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని హరించివేస్తాయి. ఈ శిలాజిత్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అనారోగ్యం బారిన పడకుండా నిరోధిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: