సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏడ్చినపుడు కళ్ల నుంచి న్నీళ్ళు రావడం చూస్తూ ఉంటాం.  ఏడ్చినప్పుడు మాత్రమే కాదు బాగా సంతోష పడి నప్పుడు కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. బిగ్గరగా నవ్విన కూడా ట్యాప్ ఓపెన్ చేసినట్లుగా అటు కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా బాధ సంతోషం ప్రేమ విపరీతమైన ఆనందం భరించలేనంత దుఃఖం కలిగినప్పుడు కన్నీళ్లు  ఉంటాయన్నది అందరికీ తెలుసు. ఇంతకీ ఇలా ఏదైనా బావోద్వేగం  కలగానే కన్నీళ్లు రావడానికి గల కారణమేంటి అన్నది చాలా మందికి తెలియదు.


 ఆ వివరాలేంటో తెలుసుకుందాం... కన్నీళ్లు ప్రతి మనిషి మానసిక స్థితికి సంబంధించినవి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతే కాదు ఇక కన్నీళ్లను కూడా మూడు వర్గాలుగా విభజిస్తారట. మొదటిది బేసల్ టియర్స్.. నాన్ ఎమోషనల్ కన్నీళ్లు. అయితే కళ్ళు ఎండిపోకుండా ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే వస్తాయి. రెండవది భావోద్వేగాలు లేని కన్నీళ్లు ఉల్లిపాయలు కత్తరించి నప్పుడు గాఢమైన వాసన పీల్చడం లాంటివి చేసినప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. ఇక మూడవది క్రయింగ్ టియర్స్. ఏడుపు వచ్చినప్పుడు భావోద్వేగ ప్రతిస్పందనగా కన్నీళ్లు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి.


 అయితే మానవ మెదడు లో లింబిక్ వ్యవస్థ అనేది ఉంటుంది. దీనిలో మెదడు హైపోథాలమస్ ఉంటుంది. ఈ భాగం నాడీ వ్యవస్థ తో ప్రత్యక్షమైన బంధాన్ని కలిగి ఉంటుందట. ఇక ఈ వ్యవస్థ న్యూరోట్రాన్స్మిటర్ సంకేతాలను ఎప్పుడూ మెదడుకు చేరవేస్తూ ఉంటుంది. భయ పడటం బాధపడటం ఏడవటం లాంటివి చేసినప్పుడు ఇక మెదడు ప్రతి స్పందనగా కన్నీళ్లను వచ్చేలా చేస్తూ ఉంటుందట. కాగా ఉల్లిపాయలలో  ఉండే రసాయనం కారణంగా వాటిని కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి. అంతేకాదండోయ్ ఏడ్చినప్పుడు శరీరంలోని విషపదార్థాలు కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తాయి.  కాసేపు ఏడ్చిన  తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: