ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ మంది బాధపడుతోన్న వ్యాధి ఏదైనా ఉందంటే అది షుగర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా భారతీయులు అయితే ఈ వ్యాధి బారిన పడడం ఇటీవల చాలా ఎక్కువతోంది.మారుతోన్న జీవన విధానం, ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్‌ సమస్య పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ ఎన్నో కారణాలు ఉండగా.. వాటిలో కొన్ని తెలిసి చేసే తప్పులు ఉంటే మరికొన్ని తెలియక చేసేవి కూడా ఉంటాయి. స్మోకింగ్ శ్వాస వ్యవస్థపై తీవ్ర దెబ్బ తీస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే పొగతాగడం టైప్‌ 2 డయాబెటిస్‌కు కూడా కారణమవుతుందని పరిశోధనల్లో తేలింది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో 30 శాతం నుచి 40 శాతం వరకు డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్మోకింగ్కు ఎంత త్వరగా దూరమైతే మంచి మంచిదని సూచిస్తున్నారు.ఈ రోజుల్లో కూల్‌ డ్రింక్స్‌ సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే మీరు నిత్యం కూల్‌ డ్రింక్స్‌ తీసుకుంటే డయాబెటిస్‌ బారిన పడడం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విపరీతంగా ఉండే షుగర్‌ కంటెంట్‌ కారణంగా షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి బదులుగా పండ్ల రసాలను అలవాటు చేసుకోవాలి.ఇంకా అలాగే ప్రస్తుతం సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. మారుతోన్న జీవన విధానం కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. సరైన నిద్రలేని వారిలో హార్మోన్ల సమతుల్యం దెబ్బ తింటుంది. దీనివల్ల డయాబెటిక్‌ రిస్క్‌ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


అంతేకాకుండా నిద్రలేమి వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది, దీంతో క్రమ శిక్షణ లేని డైట్‌ కారణంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని చెబుతున్నారు.శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటి స్థానంలో కాంప్లెక్స్‌ పదార్థాలు తీసుకోవాలి. కాబట్టి వైట్‌ రైస్‌కి బదులుగా బ్రౌన్‌ రైస్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. మైదాకు దూరంగా ఉండాలి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది.ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం డయాబెటిస్‌కు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. మారుతోన్న వర్క్‌ కల్చర్‌ కారణంగా చాలా మంది కంప్యూటర్ల ముందు గంటల కొద్ది కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇది మెటాబాలిజమ్‌కు ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కనీసం గంటకొకసారైనా లేచి నాలుగు అడుగులు వేయకుండా ప్రమాదమని చెబుతున్నారు. ఇలా గంటల కొద్ది ఒకేచోట కూర్చుంటే టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: