ప్రతిరోజు మనం చూసే వాటితోనే పలు లాభాలు ఉంటాయి. అయితే వాటిని సరిగా ఉపయోగించుకుంటే మనకు తగిన ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. అలా మన ఇంట్లోనే ఉండేటువంటి కొన్ని చిట్కాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒకరి ఇంట్లో ఉండే పదార్థం కొబ్బరి నూనె .. దీనిని ప్రతిరోజు కాస్త కొబ్బరి నూనెను తీసుకొని నోటిలో పోసుకొని పుక్కిలించడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యానికి కొబ్బరి నూనె చాలా సహాయపడుతోందని కొంతమంది నిపుణులు  తెలియజేస్తున్నారు.


1). ప్రతిరోజు కాస్త కొబ్బరి నూనెను ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా పుక్కిలించినట్లు అయితే పలు ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు చేశారంటే పళ్ళు దృఢత్తోమే కాకుండా నోట్లోని క్రిములు కూడా మరణిస్తాయట.


2). ఇక వీటితోపాటు దంతాలు , నాలుక , చిగుళ్ళు రక్తస్రావము వంటివి పూర్తిగా తగ్గిపోతాయట. అయితే మనం నవ్వినప్పుడు ఫేస్ చాలా అందంగా కనిపించాలి అంటే ఇలాంటి వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది  ఎందుచేత అంటే చెంప బాగాన రక్తప్రసరణ బాగా జరిగి చర్మం చాలా మెరుస్తుందట.


3). ఇలా కొబ్బరి నూనెను నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల కంటి నరాలకు మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. అలాగే దృష్టి సమస్యలను కూడా దరిచేరవట ఎక్కువగా కంప్యూటర్ మొబైల్ చూసేవారు.. ఇలా చేయడం చాలా మంచిదట. ముఖ్యంగా నోటిలోని బ్యాక్టీరియాను సైతం నశింప చేసి దుర్వాసన లేకుండా చేస్తుందట.



4). ఈ ఆయిల్  పుల్లింగ్ ప్రతిరోజు ఒక నెల రోజులపాటు చేసి ఆ తర్వాత వారంలో రెండు రోజులకు ఒకసారి చేస్తే పళ్ళు పాచి పట్టకుండా ఉండడమే కాకుండా.. పళ్ళు కూడా దృఢత్వంగా తయారవుతాయి.


5). ఒకవేళ ఇలా ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత వేడి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం కూడా చాలా అందంగా మెరుస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: