మన వంటింట్లో దొరికేటువంటి మెంతులు రుచికి కాస్త చేదుగా అనిపించినప్పటికీ వీటివల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకున్నట్లయితే పలు సమస్యలను కూడా నివారిస్తుందట. ఇక మెంతి గింజలలో ఎక్కువగా ఫైబర్, కొవ్వు ,ఐరన్, మెగ్నీషియం వంటివి లభిస్తాయి. అయితే మెంతి ఆకు కూరలో మాత్రం మరిన్ని పోషకాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎవరైనా కడుపుకు సంబంధించిన సమస్య లతో ఇబ్బంది పడుతున్న, కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్న ,మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు మెంతి గింజలను తినడం చాలా మంచిది అయితే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి వ్యక్తులకు ప్రమాదం కలుగుతుందా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).ముఖ్యంగా ఎవరైనా గర్భని స్త్రీలు వీటికి దూరంగా ఉండాలి. ఇవి గర్భిణీ స్త్రీలు తీసుకున్నట్లు అయితే రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది అందుచేతనే వీటికి దూరంగా ఉండాలి.


2). అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ మెంతి గింజలను అసలు తినకూడదు ఒకవేళ మెంతులు తిన్నట్లు అయితే రక్తపోటు సమస్య అధికంగా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

3). మెంతి గింజలు మన శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి కానీ శ్వాస కోస వ్యాధుల తో ఇబ్బంది పడే వ్యక్తులు మాత్రం వీటికి కాస్త దూరంగా ఉండటం మంచిది.ఎందుచేత అంటే ఇందులో పలు ఔషధ గుణాలు ఉండటం వల్ల వారికి అలర్జీ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

4). మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగితే జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఇలా తాగడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.


5). మెంతులు ఆరోగ్యానికే కాకుండా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వీటిని తలకు రాసుకోవచ్చు.


6). గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత మెంతి ఆకుకూరతో  పప్పు ఎక్కువగా తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందట

మరింత సమాచారం తెలుసుకోండి: