ఈ టిప్స్ తో గుండెపోటు నుంచి సేఫ్ అవ్వొచ్చు?

గుండె సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే 2022 ని నిర్వహిస్తుంటారు. ఇటీవల గుండెపోటుతో కొందరు ప్రముఖులు మరణించడం మనం వినే ఉంటాం. అందుకే పెద్దవారికే గుండెపోటు వస్తుందన్న అపోహ ఇప్పుడు తొలగిపోయింది. ఏ వయసు వారైనా గుండె జబ్బులతో బాధపడవచ్చు. గుండె జబ్బులు కేవలం మూడు కారకాలపై ఆధారపడి ఉంటాయి.. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం. కాబట్టి ఈ మూలకాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించడం అవసరం.గుండె జబ్బులకు కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఊబకాయం, అధిక రక్తపోటు ఇవి యువతలో వేగంగా పెరుగుతున్నాయి. చెడు జీవనశైలి అలవాట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం స్థూలకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యువతలో ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది యువకులు జంక్ ఫుడ్, అధిక నూనెతో చేసిన వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. 


ఇది వారి ఆరోగ్యానికి చాలా హానికరం.ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించే అవకాశాలను పెంచుతోంది.వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. దీంతో రక్తపోటు, బరువు అదుపులో ఉంటాయి.మీ ఆహారంలో గుండె-ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే చేర్చండి. ఉదాహరణకు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పప్పులు, బీన్స్, గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.మీరు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే, నిపుణులైన వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సమయానికి మందులు వేసుకోవాలి.ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, గుండెకు కూడా హానికరం. మీరు ధూమపానం చేసే వారైతే, ఈ అలవాటును మానుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: