కొబ్బరి నీరు ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నీరు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.కొబ్బరి నీరుని ఆరోగ్యకరమైన డ్రింక్ గా పేర్కొంటారు. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెద్దగా పెరగవు. ఇది హైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. కాబట్టి వేడి వాతావరణంలో ఎక్కువగా తాగడానికి సలహా ఇస్తారు. ముఖ్యంగా సముద్రం చుట్టూ, వాతావరణం తేమగా ఉంటుంది. దీని కారణంగా చెమట ఎక్కువగా పట్టడంతోపాటు.. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా బయటకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో నీటి కొరత ఉండదు. అలాగే, ఇందులో శరీరానికి ఎంతో మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.అనేక పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం.. నిత్యం కొబ్బరి నీళ్ళు తాగే వ్యక్తిలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుందని నిరూపితమైంది. ఎలక్ట్రోలైట్స్ అనేవి మన శరీర శక్తిని నిర్వహించడానికి సహాయపడే ఖనిజాలు.


డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీరు ప్రయోజనకరంగా ఉంటుందా అంటే..కొబ్బరి నీళ్లు అనేవి చాలా తీపిగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర అనేది ఉంటుంది. కాబట్టి ఈ పానీయం డయాబెటిక్ రోగులకు కూడా ఆరోగ్యకరమైనదా లేదా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందా అనే ప్రశ్న తరచూ తలెత్తుతుంది. అయితే, డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీళ్ల వినియోగం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించవచ్చని చాలా జంతువులపై చేసిన పరిశోధనలో తేలింది. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది డయాబెటిక్ రోగులకు హానికరం కాదంటున్నారు. అయితే, వైద్యుని సలహా మేరకు రోజూ ఎంత మోతాదులో తాగాలో నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.కాబట్టి మీకున్న షుగర్ లెవెల్స్ బట్టి వైద్యుని సలహాతో కొబ్బరి నీరు తాగితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: