వీరు మాత్రం వంకాయ అస్సలు తినకండి?

వంకాయ కూర చాలా రుచికరమైన వంటకం. చాలా మంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు. గుత్తివంకాయ కూర అంటే గుటకలేసుకుంటూ మరి తినేస్తారు. వంకాయ తినడానికి రుచిగా ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, కొందరు మాత్రం వంకాయ కూరను తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాదని తింటే ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వంకాయ తినొద్దని చెబుతున్నారు నిపుణులు. గర్భిణీలతో పాటు మరికొందరు కూడా ఈ వంకాయను తినకూడదని చెబుతున్నారు నిపుణులు. మరి ఎవరు వంకాయను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కిడ్నీలో రాళ్లు ఉంటే వంకాయను అస్సలు తినొద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది.పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే వంకాయను తినొద్దని సూచిస్తున్నారు వైద్యులు. దీనిని తినడం వలన సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.


కళ్లలో ఏదైనా సమస్య ఉన్నవారు వంకాయ కూరలకు దూరంగా ఉండాలి. కళ్లలో మంట, వాపు, దురద ఉంటే వంకాయ తినొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.రక్త హీనతతో బాధపడేవారు వంకాయ కూర తినకూడదు. ఎందుకంటే ఇవి రక్తం పెరుగుదలకు అడ్డంకిగా పనిచేస్తాయి. ఈ కారణంగా రక్తం తక్కువగా ఉన్నవారు వంకాయ తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే, లేదా ఇతర ఆందోళనలతో బాధపడుతున్నట్లయితే వంకాయ కూరను తినకుండా ఉండాలి. ఎందుకంటే.. ఇది సమస్యను మరింత పెంచుతుంది.ఏదైనా అలెర్జీ సమస్య ఉన్నట్లయితే వంకాయను తినవద్దు. ఎందుకంటే దీనిని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే వంకాయతో చేసిన కూరలు తీనకూడదు. కారణం.. ఇది గ్యాస్ సమస్యలను మరింత పెంచుతుంది.కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా వంకాయ కూర తినకండి. లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి వంకాయ కూర తినకండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: