బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి.ఇది పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే పండు. ఈ బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదని మనకు ముందే తెలుసు.సాధారణంగా మనం బొప్పాయి పండు తొక్క తీసి, గింజలను పనికిరాదని భావించి చెత్తబుట్టలో వేస్తాం. కానీ, పరంగి పండు మాత్రమే కాదు, దాని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? అవును, పరంగి పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బొప్పాయి గింజలు మనకు ఎలా ఉపయోగపడతాయో, బొప్పాయి గింజలను ఎందుకు తీసుకోవాలి అనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..బొప్పాయి పండ్ల గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే స్థూలకాయానికి గురికాకుండా , పెరుగుతున్న బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.బొప్పాయి పండ్ల గింజల్లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనులలో తక్కువ ఫలకం ఉన్నప్పుడు, రక్తపోటు తగ్గుతుంది. ఈ విధంగా మీరు గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి గుండె జబ్బులను నివారించవచ్చు.


బొప్పాయి పండు గింజల్లో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణాలు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని సమంత తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కాబట్టి తరచుగా దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను తీసుకోవాలి.పాలీఫెనాల్స్, ఫ్లేవలోయిడ్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు బొప్పాయి పండ్ల గింజల్లో ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జలుబు వంటి అనేక వ్యాధుల ప్రమాదం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ బొప్పాయి గింజలు తినండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.బొప్పాయి విత్తనాలు నీటిలో శుభ్రం చేసుకొని.. ఎండలో 15 రోజులపాటు ఎండబెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని.. ఏదైనా ఆహార పదార్థాలను తినే క్రమంలో దాని పైనుంచి ఈ పొడిని చల్లి తినొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: