అమర్‌ఫల్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ పండు చైనాకు చెందినది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పండుకు ఆదరణ పెరుగుతోంది. మీరు ఈ పండును ఇంకా తినకపోతే, తప్పకుండా ప్రయత్నించండి. ఇది రుచిగా ఉండటమే కాదు, ఇందులో పోషక విలువలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇది మన ఆరోగ్యానికి చేసే మంచి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదో అద్భుత ఆరోగ్య నిధి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండి..DNA దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. ఫ్లేవనాయిడ్స్ మరియు క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. పొటాషియం వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది.రక్తపోటును తగ్గించే ఏజెంట్‌గా కూడా అమర్‌ఫల్‌ పనిచేస్తుంది. శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తక్కువ రక్తపోటు, హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు వివిధ గుండె సంబంధిత పరిస్థితులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.


రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.ఇది ఎన్నో విటమిన్లు కలిగి ఉంది. ఇందులో విటమిన్ -ఎ పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ సి, ఇ, కె, బి1, బి2, విటమిన్ బి6, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. మొత్తంమీద ఈ పండును సహజ మల్టీవిటమిన్‌గా చెబుతారు. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ పండు బాగా సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో అనేక అంటువ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: