ఇప్పుడున్న కాలంలో శారీరక శ్రమ తక్కువ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలామంది.. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.మరీ వర్క్ ప్రమ్ హోమ్ వల్ల ఒకే చోట ఎక్కువ గంటలు కూర్చొని పని చేయాల్సి వస్తోంది. దీని వల్ల ముఖ్యంగా బరువు పెరగడం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు.

అలాంటి వారికి బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక బొప్పాయి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ పొట్టను శుభ్రంగా చేయడమే కాకుండా..శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది . ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.మరియు బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా అధికంగా లభిస్తాయి. ఇది అధిక బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు, అధిక బరువు తగ్గించడానిక బొప్పాయి పండును ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి – పెరుగు: పొట్ట చుట్టూ కొవ్వు తో బాధపడేవారు ఉదయాన్నే టిఫిన్ బదులుగా పెరుగులో కట్ చేసిన బొప్పాయిని వేసుకొని తినాలి.కావాలంటే ఇందులో మరికొన్ని పండ్లను కూడా చేర్చుకోవచ్చు.ఇందులో వాడే పదార్థాలలో డైయేటరీ పైబర్స్ అధికంగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వును వెన్నలా కరిగిస్తుంది.ఇందులో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది తింటే చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది.తినాలానే కోరికను తగ్గిస్తుంది.

పాలు – బొప్పాయి: ఉదయాన్ని ఎక్కువగా టిఫిన్ తినాలనిపిస్తే బొప్పాయి తినొచ్చు. ఒక గ్లాసు క్రీమ్ పాలతో బొప్పాయి కలిపి తీసుకోవాలి. దీనితో మీకు ప్రొటీన్లు పుష్కళంగా అంది, కడుపు నిండిన భావన కలిగి చాలా సేపు తినాలానే కోరికను పుట్టించదు. ఇంకా ఆరోగ్యానికి కూడా  చాలా మంచిది. దీంతో నడుము సన్నగా అవ్వడమే కాకుండా బరువు తగ్గొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: