కొందరు  ఆహారపదార్థాలను రెండు, మూడు రోజులకు సరిపడా తయారుచేసుకుని వాటిని నిల్వచేసుకోని తినే ముందు వేడిచేసుకుని తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య వైద్య నిపుణులు. అసలు వండిన ఆహారాన్ని 3 గంటలలోపు లేదా అదే రోజున తినాలి. ఇక మనం తయారు చేసుకున్న ఆహారాన్ని గాలి కూడా చేరని డబ్బాల్లో ఎంత నిల్వ ఉంచినా.. మరుసటి రోజుకు ఆ ఆహారం తాజాగా ఉండదు. అది ఖచ్చితంగా కూడా పాడైపోతుంది.దాన్ని ఫ్రిజ్లోపెట్టి నిల్వచేసినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇంకా అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు కనుక తీసుకుంటే అది మిమ్మల్ని ఖచ్చితంగా మరింత సోమరులను చేస్తుంది. సాధారణంగా వండిన ఆహారాన్ని వంట చేసిన దాన్ని కొన్ని గంటల్లోనే తినాలని.. మరుసటి రోజుకు కనుక మిగిలి ఉంటే వాటిని అవశేషాలు అంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నిల్వ ఉన్న ఆహార పదార్థాలలో ఎటువంటి శక్తి ఉండదని, అందుకే అవి మరింత నీరసంగా, సోమరిపోతులుగా చేస్తాయని చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం కూడా తక్కువు ఉంటుంది. ఇది ఖచ్చితంగా మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది.


తాజా ఆహారం అనేది మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే.. నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని పెంచుతుందని  వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.మిగిలిపోయిన ఆహారం అనేది చాలా తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని ఎప్పుడూ తినడం వల్ల ఖచ్చితంగా నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వారు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.అయితే ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎందుకంటే ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో వారు తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా కానీ దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో బలంగా ఉండేవారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో ఒక కూరను ఏకంగా రెండు రోజులకు వండేసుకుంటున్నారు. ఇక రేపు వంట చేసే శ్రమ తగ్గుతుందని ఈ రోజే ఎక్కువ వండేసి ఫ్రిజ్లో పెట్టడం ఈరోజుల్లో చాలామంది కూడా చేస్తున్నారు. పైగా వాటిని ఫ్రిజ్ నుంచి తీసి మళ్లీ వాటిని వేడి చేసి తింటున్నారు.అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండేదుంకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: