మన శరీరంలో ఎలాంటి రోగాలనైనా ఎదురించడానికి విటమిన్ ‘సి’ చాలా అవసరం. అలాంటీ విటమిన్ సి కి పుట్టినిల్లు వంటిది ఉసిరికాయ. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఉసిరికి ఆయుర్వేద చికిత్సలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ రోగానివారిణి అని చెప్పవచ్చు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..


1).ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఏదొక రూపంలో ఉసిరికాయను తీసుకుంటూ ఉన్నట్లు అయితే ఎలాంటి పైత్యాలు అయినా తగ్గుతాయి. దీని వల్ల కఫము,జలుబు, దగ్గు, తొందరగా ఉపాశమానం కలిగిస్తుంది. మగవారు దేనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల వీర్యపుష్టి కలుగుతుంది.దృష్టి లోపాలను నివారిస్తాయి.

2).మధుమేహం తగ్గించడానికి..
మధుమేహంతొ బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది.ఉసిరికాయతో పాటు తేనె, త్రిఫల చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి రోజు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధి తగ్గుతుంది.

3).కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..
ఉసిరిలో మిగతా పండ్ల లోని విటమిన్ సి కన్నా ఎక్కువగా లభిస్తుంది.ఇందులో ఉండే క్రోమియం శరీరంలోని చెడుకొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

4).రోగ నిరోధక శక్తిని పెంచడానికి..
ఆమ్లా విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, మెటబాలిజంను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.

5).గుండె సమస్యలను నివారిస్తుంది..
ఇందులో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.రక్త ప్రసరణ బాగా జరిగేలా దోహదపడి బిపిని కంట్రోల్ లో ఉంచుతుంది.

6).క్యాన్సర్ వ్యాధికి
ఉసిరితో  తయారుచేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి కి, కోబాల్ట్ చికిత్స చేయించుకునే వారికి వచ్చే నీరసం తగ్గి, తక్షణ శక్తితో ఉత్సాహంగా ఉంటారు.

7).నులిపురుగులు నివారించడానికి..
పిల్లలకు ఉసిరిని బెల్లంతో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు ఇస్తువుంటే జీర్ణకోశంలోని గల నులిపురుగులు, బద్దె పురుగులు, కొంకి పురుగులు, ఏలిక పాములు వంటివి నశించి,జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: