మఖానాలు వివిధ రోగాలు చికిత్స చేయడానికి సాంప్రదాయ ఔషధాలలో దీనికంటూ ప్రత్యేక స్థానం వుంది.దీనిని ఎక్కువగా కాల్చి, రుచికరమైన స్నాక్ లాగా లేదా కూరలు, ప్రైడ్ డిష్‌లు లేదా డెజర్ట్‌ల గా తీసుకుంటువుంటారు.వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం..

1). పోషకాలు సమృద్ధిగా ఉంటాయి..
మఖానా అనేక ముఖ్యమైన పోషకాల నెలవు అని చెప్పవచ్చు.వీటి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది.
ఇందులో పిండి పదార్థలను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. అంతేకాక  కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి న్యూట్రియన్స్ సమృద్ధిగా లభిస్తాయి.ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. మెగ్నీషియం  దీనిలో అధికంగా ఉండటం వల్ల ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల సంకోచాలు, నరాల పనితీరూను మెరుగుపరుస్తుంది.

2).యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
మఖానాలో వివిధ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడుతుంది.అంతే కాకుండా గుండె జబ్బులు , క్యాన్సర్ మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలనుండి కాపాడుతుంది.ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాసిస్ మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని నిరోధిస్తుంది.

 3).మధుమేహాన్ని తగ్గించడానికి..
మఖానా తగిన మొత్తంలో తీసుకున్నప్పుడు,ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

4).అధిక బరువు తగ్గడానికి..
 రోజువారి  ఆహారంలో మఖానా విత్తనాలను తీసుకోవడం వల్ల  ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా అంది, అధిక బరువును తగ్గిస్తుంది.ప్రోటీన్ తీసుకోవడం వల్ల తొందరగా కడుపు నిండిన భావన కలిగి, తక్కువ తినడానికి ప్రేరేపిస్తుంది. జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలాగా చేస్తుంది. దీనివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను బయటికి పంపి, అధిక బరువు ఉబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మహిళలు తమ రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల, ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిని పిల్లలకు పెట్టడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా జరిగేలా సహాయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: