పొడి దగ్గు, జలుబు పిల్లలు, పెద్దలు ఇద్దరినీ ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఇవి చాలా అసౌకర్య పరిస్థితిని తెచ్చిపెడతాయి.అందువల్ల రోగి పదేపదే ఇబ్బంది పడతాడు. దగ్గు కారణంగా అతని ఛాతీ వరకు నొప్పి వస్తుంది.జలుబుకు ఇంకా పొడి దగ్గుకు వైద్య చికిత్స ఉంది.కానీ మీరు కొన్ని ఇంటి నివారణలను (డ్రై-దగ్గు హోం రెమెడీస్) పాటించడం ద్వారా ఈ రెండు సమస్యలను కూడా ఈజీగా నయం చేయవచ్చు. ఇక మీ కళ్లలో నీరు రావడం ప్రారంభించినప్పుడు అప్పుడు మీ ముక్కు మూసుకుపోతుంది.ఇక దగ్గు మిమ్మల్ని బాధపెడుతుంది.అందుకే వెంటనే ఈ ఇంటి నివారణలను పాటించండి.ఇక మారుతున్న సీజన్‌లో పొడి దగ్గుకు నివారణలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు పొడి దగ్గు ఇంకా అలాగే జలుబుతో బాగా బాధపడుతుంటే.. సొంటి, ఎండుమిర్చి, తమలపాకు ఇంకా అలాగే తులసి ఆకులను కషాయం చేసి త్రాగాలి. ఈ మంచి మూలికలన్నీ కూడా ప్రతి ఇంటిలో ఉంటాయి. మీకు పాన్ చేసుకోవడం కనుక రాకపోతే, మీరు ఇతర  కషాయాలను తయారు చేసుకోవచ్చు. ఇక ఈ మూలికలన్నింటినీ కషాయాలను తయారు చేయడానికి, మీరు ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని,ఆ తరువాత దానికి ఈ మసాలా దినుసులను కలపండి.


ఇక వాటిని ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు ఉడికించాలి. నీరు సగం మిగిలినప్పుడు, దానిని ఫిల్టర్ చేసి మీరు గోరువెచ్చగా తినండి. కావాలంటే అందులో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ కషాయాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల పొడి దగ్గు, జలుబు నుండి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.ఇక డికాక్షన్‌లో ఉండే సొంటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వాపు, నొప్పి నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది. అల్లంలో ఉండే జింజెరోల్స్  ఇంకా షోగోల్ అనే పదార్ధాలు శరీరంలో ఇన్ఫ్లమేటరీ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నొప్పి, వాపు నుంచి చాలా ఈజీగా ఉపశమనాన్ని అందిస్తాయి. బ్లాక్ పెప్పర్‌లో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వాపును చాలా ఈజీగా తగ్గిస్తుంది. జలుబు, ఫ్లూ నుండి కూడా చాలా ఈజీగా ఉపశమనం అందిస్తుంది. ఈ డికాక్షన్‌లో ఉండే తులసి, తమలపాకులను తీసుకోవడం వల్ల మీ శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: