తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. కానీ కొంతమందికి ఎప్పుడూ నీరసంగా ఇంకా నిద్ర మత్తుగా అనిపిస్తుంటుంది.అయితే కొంతమంది రోజంతా కూడా నిద్రపోతూనే ఉంటారు. అసలు అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోతారు. నిజానికి ఆరోగ్యపరంగా ఇది చాలా హానీకరం. ఇలా పగటి వేళ ఎక్కువగా నిద్రపోవడాన్ని వైద్య పరిభాషలో హైపర్సోమ్నియా అని అంటారు.హైపర్సోమ్నియా సమస్యతో బాధపడే వ్యక్తి అన్ని వేళల్లో నిద్రపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఉదయం పూట నిద్ర నుంచి లేచిన తర్వాత కూడా మళ్లీ మంపుగానే ఉంటారు. వెంటనే నిద్రలోకి జారుకుంటారు. మళ్లీ మళ్లీ నిద్ర వస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంటుంది. వీళ్ళు అసలు నిద్ర లేకుండా జీవించలేరు.వారికి ప్రతిరోజూ కూడా ఇలాగే ఉంటుంది.వారి రోజువారి పనులను పూర్తి చేయడం వీరికి పెద్ద సవాల్‌గా ఉంటుంది.ఇక నిద్రలేమి సమస్యకు అలాగే హైపర్సోమ్నియాకు చాలా తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


రాత్రి నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట నిద్రలేమి సమస్య చాలా బాగా వేధిస్తుంటుంది. అయితే దానికి హైపర్సోమ్నియాకు అసలు సంబంధం లేదు.హైపర్సోమ్నియాలో ఒక వ్యక్తి 7 నుంచి 8 గంటల దాకా నిద్రపోయినప్పటికీ.. పగటిపూట బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అన్ని సమాయాల్లో కూడా నిద్ర మత్తుగా ఉంటారు. వారికి అసలు ఛాన్స్ దొరికితే నిద్రపోతారు.అసలు సాధారణ నిద్రకంటే ఎక్కువగా నిద్రపోతారు.ఇక ఇది ఊపిరితిత్తుల వ్యాధి, నరాల సమస్యలు లేదా మెదడు సంబంధిత సమస్యల వల్ల ఈ హైపర్సోమ్నియా సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఈ హైపర్సోమ్నియాకు నిర్ధిష్ట కారణం కూడా ఏమీ లేదంటున్నారు.అయితే మహిళలు హైపర్సోమ్నియాకు ఎక్కువగా గురవుతారని నివేదికలు చెబుతున్నాయి.ఇక అంతేకాకుండా, 24 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు ఇంకా పెద్దలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందని, ఇక అలా అయితే, దీనిని ఈజీగా నియంత్రించగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: