రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించాలంటే ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ నీళ్లు కొద్దిగా వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల నల్ల ఎండు ద్రాక్షను వేయాలి. అలాగే ఆ తరువాత ఇందులో ఒక స్పూన్ అల్లం తరుగును వేసి ఈ నీటిని పది నిమిషాల పాటు అలాగే బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి ఇందులో ఒక ఒక టీ స్పూన్ గ్రీన్ టీ పొడిని వేయాలి.ఆ తరువాత ఈ గిన్నెపై మూతను తీయకుండా అలానే ఉంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీరుని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసి బాగా కలపాలి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం ఇందులో తేనెను వేసుకోకపోవడమే మంచిది.ఇక ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజంతా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పానీయాన్ని రెండు లేదా మూడు టీ స్పూన్లలో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి భోజనానికి సరిగ్గా ఒక గంట ముందు తీసుకోవాలి. ఆహారాన్ని తీసుకునే ప్రతిసారి కూడా ఈ పానీయాన్ని ఈ విధంగా తీసుకోవాలి.


ఈ పానీయాన్ని తీసుకున్న రెండు నుండి మూడు రోజుల్లోనే మన శరీరంలోనే వచ్చే మార్పును మనం ఈజీగా గమనించవచ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది.అందువల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా మీకు తలెత్తకుండా ఉంటాయి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల గుండె సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. ఈ టిప్ పాటిస్తూనే మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. రోజు ఖచ్చితంగా కనీసం 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి.అలాగే జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉండాలి.అలాగే సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఇంకా అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ టిప్ పాటిస్తూనే తగిన ఆహార నియమాలను పాటించడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: