ఇప్పుడు మారిన ఆహార అలవాట్లు వల్ల కడుపులో మంట, గ్యాస్, అజీర్తి , మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు ఏదో ఒక కారణంతో వస్తుంటాయి.కారం, మసాలాలు ఎక్కువగా వున్న ఆహారాలు, జంక్ ఫుడ్స్ లేదా ఏదయినా శరీరానికి పడని పదార్థాలను తిన్న కడుపులో మంట వస్తుంది. ఇలా ప్రతిఒక్కరూ ఏదో సమయంలో బాధపడుతుంటారు. దీనికోసం ఇంగ్లిష్ మందులు కన్నా ఇంటి చిట్కాలే గొప్పగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 గుండెల్లో మండుతున్నట్టు అనిపించడానికి కారణం మన పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు. ఇవి సరైనా సమయంలో ఆహారం జీర్ణం అవ్వడానికి ఉత్పత్తి అవుతాయి.మసాలా  పదార్థాలు తిన్నప్పుడు, వాటితో కలిసినప్పుడు గ్యాస్ ఊత్పత్తి అయి కడుపులో మొదలైన మంట గుండె వరకు వ్యాపిస్తుంది.దీనిని పరిష్కరించుకోవడానికి కొన్ని ఆహారాలతో తింటే సరి.

 1.తాజా పండ్లు ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయి. వాటిల్లో ముఖ్యంగా అరటి, యాపిల్ , బొప్పాయి వంటివి వేడిని తగ్గించి, మసాలాల కారణంగా వచ్చే మంటకు ఉపశమనం కలిగిస్తాయి.

2.యాపిల్ సైడర్ వెనిగర్ కు గ్యాస్ సమస్యలకు తొందరగా చెక్ పెట్టె గుణం ఉంటుంది.దాని కోసం గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది.

 3.ప్రోబయోటిక్ ఫుడ్స్ ప్రోబయోటిక్ ఫుడ్స్ గట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. హానికరమైన సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహ

4.కలబంద జ్యూస్ జీర్ణశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.దీని కోసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్ఫూన్ కలబంద జ్యూస్ కలిపి, సరిపడినంత తేనే వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

5.గ్రీన్ టీ గుండెల్లో మంటకు వెంటనే ఉపశమనం కలిగించడమే కాకుండా, చలికాలంలో వచ్చే అలెర్జిలను తగ్గించే కారకాలు పుష్కళంగా వుంటాయి.దీనిని తరుచుగా తీసుకోవడం వల్ల,ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. విటన్నింటితో పాటు సరైనా ఆహార అలవాట్లు, నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: