ఇక నోటి దుర్వాసన కారణంగా ఎవ్వరు మీ దగ్గరకి కూడా రారు. అసలు పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. ఇక తిన్న తర్వాత అయితే ఈ సమస్య బాగా పెరుగుతుంది. అయితే కొంతమంది తిన్న తర్వాత పళ్ళు తోముకుంటారు కానీ తర్వాత కూడా ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడతారు. పైగా ఎక్కువగా బ్రష్ చేయడం వల్ల దంతాలు ఇంకా అలాగే చిగుళ్ళలో అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. అయితే వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు మంచి మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేస్తాయి. తిన్న తర్వాత వీటిని నమలినట్లయితే నోటి నుంచి వచ్చే దుర్వాసన నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.ఇక పుదీనా వాసన అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్కెట్‌లో లభించే అనేక మౌత్ ఫ్రెషనర్లు ఇంకా అలాగే టూత్‌పేస్ట్‌లలో ఈ పుదీనా కలుపుతారు. తిన్న తర్వాత కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన చాలా ఈజీగా పోతుంది.ఎందుకంటే పుదీనాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చెడు వాసన వచ్చే బ్యాక్టీరియాను ఈజీగా చంపుతుంది.


ఇంకా అలాగే ఆహారం తిన్న తర్వాత లవంగాలు తింటే నోటి దుర్వాసన సమస్య ఉండదు.ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాను చాలా ఈజీగా నాశనం చేస్తాయి.ఈ లవంగాలు సువాసనగా ఉంటాయి. వీటిని తినడం వల్ల నోటిలో తాజాదనం అనేది బాగా ఏర్పడుతుంది.ఇంకా అలాగే సోంపు కూడా మీ నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తుంటే తిన్న తర్వాత ఖచ్చితంగా సోంపు వేసుకోవాలి. కొద్దిసేపట్లో నోటిలో మీకు తాజా వాసన వస్తుంది. సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన నుంచి తక్షణ ఉపశమనం కూడా లభిస్తుంది.అలాగే ఎక్కువ సేపు నీళ్లు తాగకపోతే నోటి దుర్వాసనను వ్యాపింపజేసే బ్యాక్టీరియా నోటిలో బాగా పెరుగుతుంది. ఇక తక్కువ నీరు తాగే చాలా మంది ప్రజలు నోటి దుర్వాసన సమస్యను ఈజీగా ఎదుర్కొంటారు. మీరు ఈ సమస్యను నివారించాలంటే ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: