ఇక చాలా మంది కూడా గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ల బారిన పడగానే దగ్గు సిరప్ లను అలాగే యాంటీ బయాటిక్ మందులను వాడుతూ ఉంటారు. దగ్గు మందు అవసరం లేకుండా ఇంటి చిట్కాలతో ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల దగ్గు, గొంతు నొప్పి ఇంకా అలాగే జలుబు వంటి సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇంకా ఈ మందుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక దీనిని తయారు చేసుకోవడానికి 6 ఎమ్ ఎల్ కొబ్బరి నూనె, 1 ఎమ్ ఎల్ పిప్పర్ మెంట్ నూనె, 1 ఎమ్ ఎల్ లవంగం నూనె, 1 ఎమ్ ఎల్ దాల్చిన చెక్క, 1 ఎమ్ ఎల్ యూకలిప్టస్ నూనె, 1 గ్రాము పచ్చ కర్పూరాన్ని ఇంకా అలాగే 1 గ్రాము వాము పువ్వును వాడాల్సి ఉంటుంది. వీటన్నింటితో తయారు చేసుకున్న ఈ మందుని మనం లోపలికి తాగకూడదు. చర్మం పై లేపనంగా రాసుకోవడానికి లేదా వేడి నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడానికి మాత్రమే ఈ మందుని ఉపయోగించాలి. ఈ పదార్థాలతో తయారు చేసిన నూనెను అర టీ స్పూన్ తీసుకుని వేడి నీటిలో వేసి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మనం ఆవిరి పట్టుకోవాలి.


ఇలా ఆవిరి పట్టడం వల్ల దగ్గు, జలుబు నుండి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక వస్త్రానికి లేదా టిష్యూ పేపర్ కు ఈ నూనెను కొద్దిగా రాసి వాసన చూస్తూ ఉండడం వల్ల కూడా మీకు చాలా మంచి ఉపశమనం కలుగుతుంది.ఇలా వాసన చూడడం వల్ల ముక్కు దిబ్బడ ఇంకా ముక్కు కారడం కూడా తగ్గుతుంది. ఇలా తయారు చేసుకున్న నూనెను గొంతు మీద చర్మం పై రాసుకోవడం వల్ల గొంతు నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది. అలాగే దీనిని తలకి రాసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమయంలో వచ్చే తలనొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా దగ్గు, జలుబే కాకుండా ఈ నూనెను రాసుకుని వేడి నీటితో కాపాడం పట్టడం వల్ల కండరాల నొప్పులు కూడా ఇట్టే తగ్గుతాయి. ఇక పై పూతగా ఈ నూనెను వాడుతూనే అల్లం ముక్కలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే గొంతు నొప్పి, దగ్గు, గొంతు రాపిడి, గొంతు గరగర వంటి సమస్యలన్నీ సులభంగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: