వాము ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కడుపు నొప్పి, గ్యాస్, గాలి, కడుపు నొప్పి, అజీర్ణం వంటి అనేక రకాల కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగంచడంలో  ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు, పెద్దలు పాటించిన ఆయుర్వేద వైద్యంలో కూడా వాముకు చాలా కీలక పాత్ర ఉంది. ఇక ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని మెరుగుపరచడంలో, అతిసారం ఇంకా అలాగే మలబద్ధకానికి చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాము జీర్ణశక్తికి చాలా మంచిది. ఇది చూడటానికి జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా అలాగే కారంగా ఉంటుంది. ఇది రూపంలో చిన్నదైనా, ఇది చేసే మేలు మాత్రం చాలా పెద్దది. ఇక  వామును తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో  ఇప్పుడు తెలుసుకుందాం..వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా తేనే వేసుకుని తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి.


అలాగే శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము టీ చేసుకుని తాగడం చాలా మంచిది. అంతేకాదు వాము టీ తాగడం వల్ల క్యాన్సర్ వంటి భయంకర రోగాలు దరిచేరవు.ఇంకా అలాగే అసిడిటీ, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారు వాము నీటిని కనుక తాగితే..ఆ సమస్యలు తగ్గుతాయి.ఇంకా వాము తినడం వల్ల మలబద్దకం ఇంకా కడుపు ఉబ్బరం తగ్గుతాయి.అలాగే గర్భిణీ, బాలింతలకు కూడా వాము మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము మంచి పాత్ర పోషిస్తుంది.ఇక వాము నూనెను కీళ్లకు మర్దనా చేస్తే.. నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది.అలాగే వాము శరీరంలో పేరుకు పోయిన కొవ్వును తొలగించడంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది.ఇంకా అంతేకాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకకుండా వాము దివ్యఔషధంలా కూడా ఇది పనిచేస్తుంది.ఇంకా అలాగే తలనొప్పి, మైగ్రేన్, అలసటను కూడా తగ్గిస్తుంది.ఈ వాములో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా అలాగే విటమిన్లు ఎక్కువుగా ఉండటం వలన రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: