ఇక తక్కువ ధరకే లభించే వంట నూనెల్లో ఖచ్చితంగా పామ్‌ ఆయిల్‌ అనేది ముందు వరుసలో ఉంటుంది. అసలు ఈ పామ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందా?లేదా కీడు చేస్తుందా అనే విషయంలో ఎవ్వరికీ కూడా సరైన క్లారిటీ లేదు.పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీల్లో బిస్కెట్లు, కుకీస్‌ ఇంకా అలాగే చాక్లెట్స్ తయారీలో కూడా పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్‌ను వినియోగిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఇంకా రెస్టారెంట్లలో అయితే ఎక్కువగా ఈ పామాయిల్‌ నే వినియోగిస్తుంటారు. వీటిని తినడంతో పాటు నిత్యం మన ఇళ్లలో వంటనూనెగా కూడా పామ్‌ ఆయిల్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటాం. ఐతే ఈ నూనెను వాడటం వల్ల ఖచ్చితంగా చాలా ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పామ్‌ ఆయిల్‌తో చేసిన వంటకాలు తింటే ఖచ్చితంగా మన పిల్లల బ్రెయిన్ డ్యామేజ్‌ అవుతుందని కూడా ఆరోగ్య చెబుతున్నారు. పామాయిల్ వల్ల గుండె జబ్బులతో పాటు చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ జబ్బు బారీన పడటం ఖాయం.


ఇంకా అలాగే మద్యపానం, ధూమపానం ఈ రెండింటి వల్ల వచ్చే నష్టాం కంటే కూడా ఈ పామ్ ఆయిల్ వాడటం వల్ల వచ్చే నష్టాలే చాలా ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ప్రపంచంలో పామ్ ఆయిల్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా మన దేశమే కావడం విశేషం. ఇక విదేశాల్లోని కొన్ని కంపెనీలు తమ విదేశాల్లో అమ్మే ఉత్పత్తులకు వేరే వంట నూనెను వాడుతూ, ఇండియాలో అమ్మే ఉత్పత్తులకు మాత్రం ఈ పామ్ ఆయిల్‌ని వాడుతున్నారట.ఈ పామ్ ఆయిల్ భూతం ఇండియాలో జనాలని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల జంక్ ఫుడ్‌కి  అలవాటు పడేలా చేసి.. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను తిననివ్వకుండా దూరం చేస్తోంది.అసలు గుండెను కాపాడే పండ్లను తినకుండా.. పామ్ ఆయిల్‌తో తయారు చేసిన జంక్‌ఫుడ్‌ తినడం వల్ల శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోయి  అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే వాటికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: